logo
Published : 27/11/2021 04:38 IST

ఉచిత బియ్యం మరో నాలుగు నెలలు

యూనిట్‌కు 10 కిలోలు

న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

రేషన్‌కార్డులు 2,53,782

యూనిట్లు 8,79,432

కొవిడ్‌ పర్యవసానాల నేపథ్యంలో పేదలకు బాసటగా నిలిచేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌ నుంచి నవంబరు వరకు కొనసాగించిన ఉచిత బియ్యాన్ని వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగించనున్నారు. ఈ మేరకు కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించింది. లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం సాధారణంగా ఒక్కో యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున అందజేస్తుంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 10 కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నాయి. దీన్నే మరో నాలుగు నెలలు కొనసాగించనున్నారు. కేంద్రం తన వరతుగా ఒక్కో యూనిట్‌కు 5 కిలోలు యాథావిధిగా సరఫరా చేయనుంది. జిల్లా వ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు లబ్ధి చేకూరుతుంది.

మరింత స్పష్టత రావాలి

బియ్యం పంపిణీపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. డీడీలు చెల్లించడంపై డీలర్లకు ఆదేశాలు జారీ కాలేదు. కానీ ఎంఎల్‌ఎస్‌ కేంద్రాల నుంచి బియ్యాన్ని యాథావిధిగా రేషన్‌ దుకాణాలకు తరలిస్తున్నారు. అంటే డిసెంబరు నుంచి మార్చి వరకు ఉచిత బియ్యం పంపిణీ కొనసాగుతుందని తెలుస్తోంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని