logo
Published : 27/11/2021 04:55 IST

నిఘా నీడలో గురుకులాలు

ఉమ్మడి జిల్లాలోని 20 పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు

న్యూస్‌టుడే, బీర్కూర్‌

పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం, సంరక్షణ అందించడమే ధ్యేయంగా బీసీ గురుకులాలు ప్రారంభించారు. విద్యార్థుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఇటీవల పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని 20 పాఠశాలల విద్యార్థుల చదువులు నిఘా నీడలో సాగుతున్నాయి.

బిగింపు ఇలా..

పాఠశాల, ముఖ ద్వారం, లోపల ప్రవేశం, వంటశాల, నిత్యావసర సరకుల నిల్వల గదులు, రోడ్డు పక్కన ఉన్న పాఠశాలలకు రోడ్డుకు ఇరువైపులా రాకపోకలు కన్పించేలా, ప్రతి తరగతి గదుల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని పర్యవేక్షించేందుకు ప్రిన్సిపల్‌ గదుల్లో మానిటర్లు ఏర్పాటు చేయించారు. ఒక్కో గురుకులంలో 16 సీసీ కెమెరాలను బిగించారు.


బీర్కూర్‌ బీసీ గురుకులంలో తెరపై పర్యవేక్షణ

ఎక్కడెక్కడంటే..

కామారెడ్డి జిల్లా: జంగంపల్లి, కుప్రియల్‌, పిట్లం బాలికల పాఠశాలల్లో, బీర్కూర్‌, బీబీపేట్‌, బిచ్కుంద, లింగంపేట్‌ బాలుర బడుల్లో.

నిజామాబాద్‌ జిల్లా: నిజామాబాద్‌ అర్బన్‌ దాస్‌నగర్‌, ఆర్మూర్‌, చీమన్‌పల్లి, బాల్కొండ, వర్ని, సాలూర బాలికల.. డిచ్‌పల్లి రాంపూర్‌, నూత్‌పల్లి, ధర్మారం, మోర్తాడ్‌, ఎడపల్లి, మోపాల్‌, కంజర బాలుర పాఠశాలల్లో.

క్రమశిక్షణతో ఉంటున్నారు : ..వసంత్‌ రెడ్డి, బీసీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌, బీర్కూర్‌

బీసీ గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం ఇటీవల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించడంతో విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటున్నారు. నాణ్యమైన విద్యతో పాటు, రక్షణ చర్యలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. నిత్యం పర్యవేక్షిస్తున్నాం.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని