logo
Published : 27/11/2021 04:55 IST

65ఏళ్ల చరిత్ర ఘనం.. వసతులు దైన్యం

సమస్యల వలయంలో గిరిరాజ్‌ కళాశాల

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం


గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల

65 ఏళ్ల చరిత్ర.. లక్షకు పైగా చదివిన విద్యార్థులు.. రాష్ట్రంలోనే అత్యధిక ప్రవేశాలు పొందిన విద్యాసంస్థ.. ఏటా ఉద్యోగ మేళాల నిర్వహణ.. ఇంతటి ఘనత ఉన్న గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది. అవసరాలకు తగ్గట్టుగా సౌకర్యాలు కల్పించాలని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునేవారు లేరు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై కథనం.

అదనంగా 50 తరగతి గదుల అవసరం ఉంటే కేవలం ఆరు మాత్రమే నిర్మిస్తున్నారు. ● స్థలం ఉన్నా భవనాల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చెయ్యాలి. గ్రంథాలయంలో కంప్యూటర్లు ఏర్పాటు చేయాలనే డిమాండు ఉంది. ● కళాశాలలో మూత్రశాలలు ఉన్నా సరిపోవడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు. మంచినీటి కోసం మిషన్‌ భగీరథ పైపులైను లేదు. కనీసం బోరుబావి కూడా ఏర్పాటు చేయలేదు. ● అంతర్గత రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఈ ప్రాంగణంలో బాలుర, బాలికల వసతి గృహాలున్నాయి. హైమాస్టు దీపాలు లేకపోవడంతో చీకట్లు నెలకొంటున్నాయి. దీంతో మైదానం మందుబాబులకు అడ్డాగా మారింది.

ఇదీ పరిస్థితి

* గిరిరాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 1956 జులై 12న స్థాపించారు. ఏటా 1500 కొత్త ప్రవేశాలతో కలుపుకొని 5 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటున్నారు. గదులు సరిపోక షిఫ్ట్‌ల వారీగా తరగతులు నిర్వహిస్తున్నారు.

* ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మ్యాథ్స్‌, సైన్స్‌ వారికి మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బీఏ, బీకాం విద్యార్థులకు తరగతులు కొనసాగిస్తున్నారు.


వీధి దీపాలు లేని అంతర్గత రహదారి

దాతలు ముందుకు రావాలి

పూర్వ విద్యార్థులు రూ.2 లక్షలతో పార్కింగ్‌ షెడ్డు ఏర్పాటు చేశారు. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న వారిలో 80 శాతం మంది ఇదే కళాశాలలో చదివారు. ఇటీవల 1975 నుంచి 1981 బ్యాచ్‌ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించి తమ వంతు సాయం చేస్తామని ప్రిన్సిపల్‌కు హామీ హామీ ఇచ్చారు. కాగా 2022 జూన్‌లో స్వయంప్రతిపత్తి గడువు ముగియనుంది. న్యాక్‌ బృందం పరిశీలనకు వచ్చేలోగా వసతులు మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది.


అధ్వానంగా రోడ్లు

వర్దిని, బీఎస్సీ, బీజెడ్సి

మాది మారంపల్లి. ఇక్కడ వసతిగృహంలో ఉండి చదువుకుంటాను. బోధనలో ఇబ్బందులు లేవు. కానీ వసతుల కొరత నెలకొంది. సరిపడినన్ని మూత్రశాలలు లేవు. అంతర్గత రోడ్లు అధ్వానంగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి.


రవాణాకు ఇబ్బంది

గణేశ్‌, ఎంఎస్‌సీఎస్‌ ద్వితీయ

ప్రయాణప్రాంగణం నుంచి కళాశాలకు బస్సు నడిపించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆటోల్లో వస్తున్నారు. రవాణా సౌకర్యం కల్పిస్తే విద్యార్థులకు ఆర్థికంగా మేలు చేయడంతో పాటు సమయభారం తగ్గుతుంది.


ప్రజాప్రతినిధులకు విన్నవించాం

లక్ష్మీనారాయణ, ప్రిన్సిపల్‌ గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల

ప్రవేశాల్లో కళాశాల రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఆనందంగా ఉంది. మౌలిక వసతుల కొరత ఉన్న మాట వాస్తవమే. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను కలిసి సమస్యలు వివరిస్తున్నాం. వారు త్వరగా స్పందించి చర్యలు తీసుకోవాలి. కళాశాల అభివృద్ధికి దాతలు సాయం చేస్తే బాగుంటుంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని