logo
Published : 27/11/2021 19:14 IST

సమస్యలపై సభ్యుల గళం

బీర్కూర్‌: మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఎంపీపీ రఘు అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో సభ్యులు పలు సమస్యలపై తమ గళాన్ని వినిపించారు. బీర్కూర్‌లోని పోచారం కాలనీ మంజీరా వారధి బైపాస్‌ రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ కో-ఆప్షన్‌ సభ్యుడు అరీఫ్‌ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. నిజామాబాద్‌ నుంచి బీర్కూర్‌, భైరాపూర్‌, మీర్జాపూర్‌, తిమ్మాపూర్‌ గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని పలు సభల్లో తీర్మానం చేసినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకానికి ఎర్రమట్టి తరలిస్తుంటే అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంపై బీట్‌ అధికారులను సర్పంచిలు నిలదీశారు. దామరంచ గ్రామంలో గత కొద్దిరోజులుగా జరుగుతున్న మిషన్‌ భగీరథ పనుల వల్ల తాగునీటి సమస్య నెలకొందని, పైప్‌లైన్‌ లీకేజీలు ఏర్పడ్డాయని అన్నారు. సమస్యను విన్నవించినా పట్టించుకోకపోవడంపై మిషన్‌ భగీరథ అధికారులపై దామరంచ ఇన్‌ఛార్జి సర్పంచి విఠల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎంపీడీవో రాధ, ఏఎమ్‌సీ ఛైర్మన్‌ అశోక్‌, సూపరింటెండెంట్‌ భరత్‌ కుమార్‌, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని