Published : 28 Nov 2021 04:07 IST
ఉపాధ్యాయ ఖాళీలు 682
న్యూస్టుడే, నిజామాబాద్ విద్యావిభాగం: జిల్లాలోని ఉపాధ్యాయుల వివరాల సేకరణలో విద్యాశాఖ కసరత్తు పూర్తయింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యాల పాఠశాలల పరిధిలో అన్ని కేటగిరీ ఉపాధ్యాయుల పోస్టులు 5873 మంజూరు కాగా 5191 మంది పని చేస్తున్నారు. 682 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు. ఎస్జీటీ 228, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం 114, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 103 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం కొత్త జిల్లాల వారీగా ఉపాధ్యాయులను కేటాయించాలని భావిస్తున్న నేపథ్యంలో ఎంఈవో, కాంప్లెక్స్ హెచ్ఎంలు, హెచ్ఎంలతో డీఈవో ఇటీవల సమావేశమయ్యారు.
Tags :