logo
Published : 28/11/2021 04:07 IST

క్రిప్టో మాయ.. పైసా గయా

న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

‘క్రిప్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయిన ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇదే తరహాలో పలువురు క్రిప్టోలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.’

ఇదీ పరిస్థితి

* క్రిప్టో కరెన్సీ! అంతర్జాతీయంగా ఒక్కో నిమిషానికి కోట్లు పెట్టుబడి పెడుతున్న డిజిటల్‌ వేదిక. ఇది రకరకాలుగా చెలామణిలో ఉంది. ఇందులో పెట్టుబడులు పెట్టిన వారి ఖాతాల్లో నగదు పెరగడం చూడటమే తప్ప తిరిగి తీసుకొన్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఈ సంస్కృతి గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది. 18 నుంచి 40 ఏళ్ల యువత క్రిప్టోలోకి నగదు మళ్లించి నిలువునా మోసపోతున్నారు.

* బిట్‌కాయిన్‌, ఇథేరియం, కార్డానో, డోర్జ్‌కాయిన్‌ తదితర క్రిప్టో కరెన్సీలు భారత్‌లో ఎక్కువగా నడుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా బిట్‌కాయిన్‌, ఇథేరియంలలో ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు, ధనవంతులు, ప్రజాప్రతినిధులు ఇందులోకి నగదు మళ్లిస్తున్నారు. జిల్లా నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, దిల్లీ వంటి మహా నగరాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్లిన వారిలో ఎక్కువ మంది దీనికి అలవాటు పడ్డారు.

* జిల్లా కేంద్రంలోనూ ఇటీవల పలు బ్రోకరేజ్‌ సంస్థలు పుట్టుకొచ్చాయి. ఇందులో పెట్టే ప్రతి రూపాయి తక్కువ సమయంలో రెండింతల లాభం తీసుకొస్తుందని నమ్మిస్తున్నారు. పెట్టుబడులకు 24 గంటల అవకాశం ఉండటంతో రూ.లక్షలు ధారపోస్తున్నారు.

* దేశంలో బిట్‌కాయిన్‌ యూజర్లు 10 కోట్లకుపైగా ఉన్నారని అంచనా. నిజామాబాద్‌ నగరం, ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌లో పలువురు వివిధ రకాల యాప్‌ల ద్వారా నగదును నేరుగా బిట్‌కాయిన్‌కు మళ్లిస్తున్నారు.

సైబర్‌ మోసాలు

క్రిప్టో పేరిట సైబర్‌ నేరాలు పెరిగినట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాల్లో వెల్లడైంది. వివిధ రకాల సామాజిక మాధ్యమాల్లో వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్ముతున్నారు. ఇటీవల నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి క్రిప్టో కరెన్సీ పేరిట వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసి రూ.5 లక్షలు పోగొట్టుకొన్నాడు. పరువు పోతుందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని