logo
Published : 28/11/2021 04:07 IST

పెద్దోళ్లం కాదు.. పేదోళ్లం

పేదరికంలో రాష్ట్రంలో ఇందూరు మూడో

స్థానం నీతి అయోగ్‌ వెల్లడి

ఇందూరు ఫీచర్స్‌, న్యూస్‌టుడే

పసుపులో పసిడి మెరుపులు... ధాన్యంలో అన్నపూర్ణ... చదువుల్లో సరస్వతీ పుత్రిక... నీటి వనరుల్లో గోదారమ్మ.. ఇవన్నీ నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా పైపై మెరుగులేనని నీతి ఆయోగ్‌ తాజా నివేదిక తేల్చిపడేసింది. ఇందూరు బిడ్డల్లో 21.44 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారని వెల్లడించింది. వివిధ రంగాల్లో దూసుకుపోతున్న ప్రగతిరథం వెంట గరీబ్‌ రథం నడవడం వల్ల రాష్ట్రంలో అత్యధిక పేదలున్న పూర్వ పది జిల్లాల్లో నిజామాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. ఆదిలాబాద్‌ ప్రథమ, మహబూబ్‌నగర్‌ ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి.

ప్రపంచ ప్రామాణికాలతో నిర్ధారణ

ఇది వరకు ఆదాయ, వ్యయం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేస్తూ వచ్చారు. ఈసారి బహుముఖ కోణాల్లో పేదరికం(ఎంపీఐ) అనే విశ్వవ్యాప్త ప్రామాణికాల్లోని విద్య, వైద్యం, అందుబాటులో ఉన్న మౌలిక వసతుల ఆధారంగా మదింపు చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన, తీవ్ర పేదరికంలో మగ్గుతున్న వారితో కొత్త నివేదిక రూపొందించారు. అందుకు 2015-16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-4ను ఆధారం చేసుకుని ప్రజల జీవన ప్రమాణాలను గణించారు. తాజా పేదరిక గణాంకాల ఆధారంగా ప్రభుత్వాలు పేదరిక నిర్మూలనకు ఆయా రంగాల్లో సమర్థ ప్రణాళికలు అమలు చేయడానికి పేదరిక నివేదిక ఉపయుక్తంగా ఉంటుందని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.


ఐదేళ్ల కార్యక్రమాలపై మదింపు అవసరం

ప్రభుత్వం ఐదేళ్లలో అమలు చేసిన వివిధ పథకాలతో పేదల సంఖ్యలో తగ్గుముఖం పట్టడానికి దోహదం చేసి ఉంటుందనే వాదన ఉంది. వ్యక్తిగతంగా ప్రయోజనం కల్పించే రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, ఆసరా పింఛన్‌ ఆర్థిక దన్నుగా నిలుస్తుండగా... మిషన్‌ భగీరథతో తాగునీరు, పట్టణ, పల్లెప్రగతి పేరుతో పారిశుద్ధ్య సేవలు, వైద్యపరంగా ఆరోగ్య మిషన్‌ అనుబంధ కార్యక్రమాల అమలు, విద్యాపరంగా చూస్తే గురుకులాల స్థాపన వంటివి అందుబాటులోకి వచ్చాయి. గడిచిన ఐదేళ్లలో అందుబాటులోకి వచ్చిన ఈ కార్యక్రమాలు పేదల జీవితాల్లో ఎంత మార్పు తీసుకొచ్చిందో సర్కారు మదింపు చేసుకోవాలి. పథకాలు అమలవుతున్నా వెనకబడిన రంగాల్లో మరింత సమర్థ ప్రణాళికలు అవసరమని గుర్తించాలి. అందుకు తాజా నీతి ఆయోగ్‌ నివేదిక దోహదం చేస్తుంది.


గ్రామీణంలోనే ఎక్కువ...

తాజా నివేదిక పట్టణ, గ్రామీణ పేదరికాన్ని వేర్వేరుగా చూపించింది. పట్టణాల్లో విద్య, వైద్యం, కనీస మౌలిక వసతుల లభ్యత గ్రామీణంతో పోలిస్తే మెరుగ్గానే ఉన్నాయి.ఎంపీఐ ఆధారంగా చూస్తే పట్టణంలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారి శాతం 11.91గా ఉంది. గ్రామీణంలో 24.71 శాతంగా నమోదైంది. విభాగాల వారీగా పరిశీలిస్తే....

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని