logo
Published : 28/11/2021 04:07 IST

అంగరంగ వైభవంగా కాలభైరవుడి డోలారోహణం

నేడు రథోత్సవం, అగ్ని గుండాలు


కాలభైరవస్వామిని తొట్లెలో వేస్తున్న ఈవో, ఛైర్మన్‌

ఇస్సన్నపల్లి(రామారెడ్డి), న్యూస్‌టుడే: ఓం.. ఓం.. భైరవ ఓం కాలభైరవ నామస్మరణతో శనివారం ఇస్సన్నపల్లి, రామారెడ్డిలోని కాలభైరవస్వామి ఆలయం మార్మోగింది. భక్తులు స్వామి జన్మదిన వేడుకలకు పెద్దఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ధ్వజారోహణం, మహాపూజ, ధక్షయజ్ఞంనిర్వహించారు. మూల విగ్రహానికి, ఆలయంలో రంగురంగుల పూలతో అలంకరించారు. ఆలయ పండితులు సింధూర పూజలు చేశారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామికి అభిషేకాలు చేసి, పూజలు నిర్వహించారు. అంతకు ముందు కాలభైరవస్వామి బంగారు విగ్రహాన్ని పోలీసు బందోబస్తు మధ్య ఆలయానికి తీసుకొచ్చారు. తొట్లెలో వేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆదివారం రథోత్సవం, అగ్ని గుండాలు ఉంటాయని ఆలయ ఈవో శ్రీరామ్‌ రవీందర్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్‌ మాలతి, సర్పంచి సంజీవ్‌, ఉపసర్పంచి ప్రసాద్‌, కమిటీ సభ్యులు రాజేందర్‌గౌడ్‌, బాలమల్లు, నాయకులు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని