logo
Updated : 30/11/2021 15:04 IST

చెట్టును ఢీకొన్న ట్రాలీ ఆటో

 19 మందికి గాయాలు

ఐదుగురి పరిస్థితి విషమం

రక్తమోడుతున్న క్షతగాత్రులు

కామారెడ్డి నేరవిభాగం, తాడ్వాయి, న్యూస్‌టుడే: లింగాపూర్‌ పరిధిలో సోమవారం ట్రాలీఆటో అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో తాడ్వాయి మండలం చిట్యాలకు చెందిన 19 మంది గాయపడ్డారు. వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. దేవునిపల్లి ఎస్సై రవికుమార్‌ కథనం ప్రకారం.. రామారెడ్డిలో వివాహానికి హాజరై తిరిగొస్తుండగా చోదకుడు వాహనాన్ని అదుపు చేయలేక రహదారి పక్కనున్న చెట్టుకు ఢీకొట్టారు. మంగలి బన్నీ(15), శ్రీకాంత్‌(21), భాను(18), కార్తీక్‌(20)తో పాటు మహారాష్ట్రకు చెందిన మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరిని హైదరాబాద్‌కు, ముగ్గురిని నిజామాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులు మధుసూదన్‌, కేవల్‌బాయి, శ్రావణ్‌, సుమలత, సతీశ్‌, నరేశ్‌, భరత్‌కుమార్‌, శివంకాంత, మారుతి, సావిత్రి, సాయిలు, వైష్ణవి, దత్తు తదితరులకు జిల్లాఆసుపత్రిలో చికిత్స అందించారు. అతివేగం ప్రమాదానికి కారణమని ప్రయాణికులు ఆరోపిస్తుండగా.. ఎవరో బాలుడు గేర్‌ లాగడంతో ఇలా జరిగిందని డ్రైవర్‌ పేర్కొంటున్నారు. ఆటోలో 20 మందికి పైగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.


Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని