ఉచితంగా రేషన్ బియ్యం
న్యూస్‌టుడే, నిజామాబాద్ కలెక్టరేట్
రేషన్ దుకాణాల ద్వారా పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నారు. నవంబరు వరకు ఒకరికి పది కిలోల వరకు ఇవ్వగా డిసెంబర్ నుంచి 5 కిలోలు ఇచ్చేందుకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ కారణంగా పేదలు ఆర్థికంగా ఇబ్బంది పడొద్దని గతేడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఆ గడువు నవంబరు ఆఖరు వరకు ఉండగా దాన్ని మార్చి వరకు పొడిగించారు. జిల్లాలోని దుకాణాల ద్వారా ఈ నెల 1 నుంచి పంపిణీ చేయాలని అధికారులు ఆదేశాలిచ్చారు.
* నిజామాబాద్ అర్బన్‌లో 87 దుకాణాలు ఉన్నాయి. ఈ నెల కోటాకు సంబంధించి డీడీలు చెల్లించగా ఇప్పుడిప్పుడే బియ్యం పంపిస్తున్నారు. దీంతో అర్బన్‌లో 3 నుంచి పంపిణీ చేయనున్నారు. ‘డిసెంబర్‌కు సంబంధించి కార్డులోని ఒక్కో సభ్యుడికి ఉచితంగా 5 కిలోలు ఇవ్వాలని ఉత్తర్వులొచ్చాయి. ఆ మేరకు పంపిణీ ప్రక్రియ సక్రమంగా పూర్తి చేయాలని డీలర్లను ఆదేశించాం.’ అని నిజామాబాద్ డీసీఎస్వో వెంకటేశ్వర్రావు తెలిపారు.
రేషన్ దుకాణాలు : 751
కార్డుదారులు : 4,06,150
బియ్యం కోటా : 7,800 మె.టన్నులు
ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.