logo
Published : 01/12/2021 04:19 IST

ఆర్టీసీ సిబ్బంది రక్తదానం అభినందనీయం

శిబిరంలో పాల్గొన్న పాలనాధికారి నారాయణరెడ్డి, ఆర్‌ఎం సుధా పరిమళ

నిజామాబాద్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఇచ్చిన పిలుపు మేరకు సిబ్బంది రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఆర్‌ఎం కార్యాలయంతో పాటు డిపో-2లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో 150 మంది రక్తదానం చేయడం సంతోషకరమన్నారు. సేవా కార్యక్రమాలపై ఆర్టీసీ మరింత దృష్టి సారించాలన్నారు. ఆర్‌ఎం సుధా పరిమళ, డీవీఎం విజయ్‌ భాను, డీఎం ఆంజనేయులు, రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాంచందర్‌, కార్యదర్శి ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని