దాడులు చేస్తే చర్యలు
అధికారిని పరామర్శిస్తున్న జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్, డీఎఫ్‌వో నిఖిత
కామారెడ్డి వైద్యవిభాగం, న్యూస్‌టుడే: అటవీ అధికారులపై దాడులు చేసేవారిపై చర్యలు తప్పవని జిల్లా పాలనాధికారి జితేష్ వి పాటిల్ హెచ్చరించారు. కొండాపూర్ శివారులో పలువురి దాడిలో గాయపడిన బీట్ అధికారులు ఫిరోజ్‌ఖాన్, మహేశ్‌ను మంగళవారం డీఎఫ్‌వో నిఖితతో కలిసి జిల్లా ఆసుపత్రిలో పరామర్శించారు. దాడి చేసిన వారిని గుర్తించామన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అటవీభూములను అక్రమంగా సాగు చేస్తున్నవారిని అడ్డుకుంటే అధికారులపై దాడులు చేయడం తగదని డీఎఫ్‌వో అన్నారు. అక్రమాలను సహించేది లేదని స్పష్టం చేశారు.
మద్యం దుకాణానికి లక్కీడ్రా
కామారెడ్డి కలెక్టరేట్, న్యూస్‌టుడే: పెద్దకొడప్గల్ మద్యం దుకాణ యజమానిని మంగళవారం కలెక్టర్ జితేష్ వి పాటిల్ లక్కీడ్రా ద్వారా ఎంపిక చేశారు. దీనికి 33 మంది పోటీ పడ్డారు. దుర్గాప్రసాద్ దక్కించుకున్నారు. ఆబ్కారిశాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ సంతోష్‌రెడ్డి తదితరులున్నారు.