logo
Published : 01 Dec 2021 04:19 IST

ఆకలితో అవస్థ గుర్తించని వ్యవస్థ..

గర్భిణులకు మధ్యాహ్న భోజనం కరవు
న్యూస్‌టుడే, కామారెడ్డి పట్టణం

వైద్యాలయాల్లో అమ్మఒడి పథకం ప్రారంభించాక ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. వారికి ఆహారం అందించాలని గతేడాది డిసెంబరులో నిర్ణయించినా ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు.

జిల్లా ఆస్పత్రితో పాటు 24 గంటల పాటు  వైద్య సేవలందించే ఆరోగ్యకేంద్రాల్లో గర్భిణులు పరీక్షల నిమిత్తం వస్తుంటారు. గంటల తరబడి నిరీక్షిస్తుంటారు. ఉదయం అల్పాహారం తిని వస్తే.. సాయంత్రం ఇంటికి చేరే వరకు పొద్దంతా ఆకలితో గడిపేస్తున్నారు. పరిస్థితులను బట్టి బీపీ, మధుమేహంతో పాటు ఇతర రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఉదయం వచ్చిన వారు ప్రక్రియ పూర్తయ్యే సరికల్లా శక్తిని కోల్పోతున్నారు. ఈ  సమస్యను గుర్తించిన యంత్రాంగం పరీక్షలప్పుడు పోషకాహారం అందించాలని నిర్ణయించినా ఆచరణ లేదు.

త్వరలో చర్యలు
- అజయ్‌కుమార్‌, జిల్లా ఆస్పత్రుల పర్యవేక్షణాధికారి

వైద్య పరీక్షలకు వచ్చే గర్భిణులకు మధ్యాహ్న భోజనం అందజేయాలని సర్కారు నుంచి ఆదేశాలొచ్చినా కొవిడ్‌ కారణంగా అమల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. త్వరలో ఐసీడీఎస్‌, వైద్యశాఖల సమన్వయంతో నూతన విధానం అమలుకు చర్యలు తీసుకుంటాం. దీనికి బడ్జెట్‌ను ఎలా వినియోగించాలో స్పష్టత కరవైంది. ఈ విషయమై ఉన్నతాధికారులతో చర్చిస్తాం.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని