logo
Published : 01/12/2021 04:19 IST

చరవాణి చోరులు

జిల్లాలో సంచరిస్తున్న ముఠా

రోజురోజుకూ పెరుగుతున్న ఘటనలు

న్యూస్‌టుడే - నిజామాబాద్‌ నేరవార్తలు

* వినాయక్‌నగర్‌కు చెందిన రవి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. శనివారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బస్సులో నిజామాబాద్‌కు వచ్చాడు. బస్సు దిగిన కాసేపటికి  రూ.40 వేల విలువైన చరవాణి మాయమైంది. ఈ ఘటనపై బాధితుడు అక్కడే ఉన్న పోలీసు సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. సీసీ కెమెరాల్లో వెతికినా ఆధారాలు దొరకలేదు.


* నగరానికి చెందిన మహేష్‌ హోటల్‌ నడిపిస్తుంటాడు. ఈ నెల 25న హోటల్‌ పనుల్లో ఉండగా కౌంటర్‌పై ఉంచిన తన రూ.25 వేల చరవాణిని ఓ దుండగుడు అపహరించుకెళ్లాడు.


* కంఠేశ్వర్‌ ఆలయంలో కార్తీకపూజల కోసం వెళ్లిన ఓ మహిళకు సంబంధించిన రూ.20 వేల ఫోన్‌ చోరీకి గురైంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులను పట్టుకోలేని పరిస్థితి నెలకొంది.

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఇటీవల చరవాణు(స్మార్ట్‌ఫోన్‌)లు దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి దేశ వ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ముఠా జిల్లాలోనూ సంచరించి చోరీలకు పాల్పడినట్లు సమాచారం.
* జిల్లాలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం గణనీయంగా పెరిగింది. ప్రతి పది మందిలో ఐదుగురైనా రూ.25 వేలకు పైగా ఖరీదైన చరవాణులను వాడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల వీటి దొంగతనాలు రెండింతలైనట్లు జాతీయ నేర గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో మిగతా చోరీలతో పోలిస్తే ఇవే ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా ఘటనలపై అధికారికంగా కేసులు కూడా నమోదు కావట్లేదు.

రద్దీ ప్రాంతాల్లోనే..
ప్రాథమిక సమాచారం ప్రకారం స్మార్ట్‌ఫోన్ల చోరీకి ఒక నెట్‌వర్క్‌ ఏర్పడినట్లు తెలుస్తోంది. గొలుసుకట్టు తరహాలో ఒకచోట చోరీ చేసిన ఫోన్‌ను మరో ప్రాంతంలోని సంబంధిత వ్యక్తులకు అప్పగిస్తున్నారు. తిరిగి అక్కడి నుంచి ముంబయి, దిల్లీ వంటి ప్రాంతాలకు చేరవేస్తున్నారు. ఖరీదైన వాటిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ప్రధానంగా వృద్ధులు, మహిళల నుంచి తీసుకుని ఉడాయిస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లు, మార్కెట్లు, రైల్వేస్టేషన్ల పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా అపహరణకు గురవుతున్నాయి.

ఏం చేస్తారంటే..?
చోరీ చేసిన చరవాణిని తిరిగి వినియోగించడం అంత సులువు కాదు. అలా అని వినియోగంలోకి తీసుకురాలేని పరిస్థితి ఉండదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక వ్యవస్థతో ఐఎంఈఐ నంబర్లను కూడా సులువుగా మార్చేస్తున్నారు. తక్కువ ధరకు విక్రయించి వ్యాపారం చేస్తున్నారు.

ఛేదించలేరా?
నిజామాబాద్‌ కమిషనరేట్‌, కామారెడ్డిలో రోజుకు ఐదారు చరవాణి చోరీ ఘటనలు జరుగుతున్నాయి. ఏటా ఈ మొత్తం రూ.25 లక్షలకు పైగా ఉంటోంది. కొన్ని ముఠాలు విడి భాగాలు వేరుచేసి తిరిగి వాడుకలోకి తెస్తున్నాయి.. సగానికి పైగా బాధితులు ఠాణాల వరకు వెళ్లి ఫిర్యాదు చేయట్లేదు. ఒకవేళ చేసినా ప్రయోజనం ఉండట్లేదు. ఐఎంఈఐ నంబర్లను మార్చడంతో ఎక్కడ వినియోగిస్తున్నారనేది గుర్తుపట్టడం అసాధ్యంగా మారుతోంది. ఫలితంగా పలు ఠాణాల్లో ఈ తరహా ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా అపరిష్కృతంగా ఉన్నాయి.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని