logo
Updated : 01 Dec 2021 04:48 IST

తెగని పోడు ఆగని గోడు

ఉమ్మడి జిల్లాలో తరచూ వివాదాలు

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

ముందు వారు.. ఆ వెనుకే వీరు.. అన్నట్లు పోడుదారులు, అటవీశాఖ అధికారులకు మధ్య ఏటా వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. తమ భూమి అంటూ అటవీ శాఖ ప్రకటించడం, కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నామని రైతులు ఆందోళనకు దిగడం పరిపాటిగా మారింది.

రెవెన్యూ, అటవీ శాఖల మధ్య సమన్వయం కొరవడి ఇరు భూముల హద్దులు తేలడంలేదు. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు దొంగచాటుగా అటవీ భూములను ఆక్రమించుకునేందుకు చెట్లను నరికేస్తూ చదును చేస్తున్నారు. ఇది వివాదంగా మారి అటవీ, పోడుదారుల మధ్య తీవ్రమైన గొడవలను సృష్టిస్తోంది. దాడులకు కారణమవుతోంది.

ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై ఆశతో
ఉభయ జిల్లాల్లోని 12 మండలాల్లో 50 వేల ఎకరాలకు పైగా అటవీ భూములు అన్యాక్రాంతమయినట్లు ఇటీవల ఆ శాఖ ప్రాథమిక సర్వేలో నిర్ధారణ అయింది. దశాబ్దాల క్రితం నుంచి గిరిజనులు అటవీ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారు. వీరికి గత ప్రభుత్వాలు ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలు మంజూరు చేశాయి. కొన్నేళ్లు ఆగితే తమకూ పట్టాలు మంజూరవుతాయనే ఆశతో సమీప రైతులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు.

వేలాది ఎకరాలు..
ఆక్రమణలకు తోడు వేలాది ఎకరాల అటవీ భూములు వివాదంలో ఉన్నాయి. మద్నూర్‌, జుక్కల్‌, పెద్దకొడప్‌గల్‌, మాచారెడ్డి, సదాశివనగర్‌, లింగంపేట, గాంధారి, ఇందల్‌వాయి, నిజామాబాద్‌ గ్రామీణం, ధర్పల్లి, సిరికొండ మండలాల్లోని భూములను అటవీ, రెవెన్యూ శాఖలు తమవంటే తమవిగా పేర్కొంటున్నాయి. కామారెడ్డి జిల్లాలో 28 వేలు, నిజామాబాద్‌లో 19 వేల ఎకరాలు ఇలా వివాదంలో ఉన్నాయి.


ఘటనలివిగో..

సెప్టెంబరు 14, 2013న ఇందల్‌వాయి మండలం నల్లవెల్లితండా అటవీ ప్రాంతంలో ఫారెస్టు రేంజ్‌ అధికారి గంగయ్యపై దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో న్యాయస్థానం 14 మందికి జీవితఖైదు విధించింది.
2016 జూన్‌లో బాన్సువాడలో డీఎఫ్‌ఆర్వో శివజ్యోతిపై భూ ఆక్రమణదారులు దాడి చేసి గాయపర్చారు. ఈ ఘటనలో నలుగురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
2018 మార్చిలో గాంధారి రేంజ్‌పరిధిలో చెన్నాపూర్‌ గ్రామస్థులు బీట్‌ అధికారిపై దాడి చేశారు.
29, 2019న సదాశివనగర్‌ మండలం యాచారంలో ఫారెస్ట్‌ సెక్షన్‌ అధికారి వెంకటస్వామిపై దాడి చేశారు. ట్రాక్టరుతో ఢీకొట్టించి పారిపోయారు.
తాజాగా లింగంపేట మండలం ముంబోజిపేటలో అటవీ భూములు చదును చేస్తున్న వారిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే దాడి చేశారు. ఇందులో ఇద్దరు అధికారులకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని