logo
Published : 01/12/2021 04:19 IST

మేము సిద్ధం

ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వసతులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. దేశంలో ఒక్క కేసు నమోదు కాకపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. రెండో దశ ముగిసే సమయానికి ఆసుపత్రుల్లో అన్ని వసతులు కల్పించాయి. భవిష్యత్తులో మూడో దశ వచ్చినా సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దాయి. ఈ నేపథ్యంలో జిల్లా ప్రభుత్వ జనరల్‌ దవాఖానాలోని సౌకర్యాలపై కథనం.


ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు: ఆక్సిజన్‌ కొరత రాకుండా ఉండేందుకు దవాఖానా ఆవరణలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. 246 పడకలకు రోజంతా సరఫరా చేయొచ్చు. ఒకవేళ కేసులు పెరిగినా ఇబ్బందులు తలెత్తకుండా చేశారు.


115 వెంటిలేటర్లు: గతంలో ఇక్కడ 15 వెంటిలేటర్లు ఉండగా కొవిడ్‌ ప్రారంభంలో మరో 15 వచ్చాయి. అనంతరం వైరస్‌ విజృంభణతో కేంద్ర ప్రభుత్వం 65 పంపించింది. యూవీకెన్‌ స్వచ్ఛంద సంస్థ వారు 18 వరకు అందజేశారు. చివరగా వాటి సంఖ్య 115కి చేరింది.


సిలిండర్లు : గతేడాది ఒకేసారి కేసులు పెరగడంతో పడకలు ఉన్నా ఆక్సిజన్‌ అందని పరిస్థితి తలెత్తింది. అప్పటికప్పుడు ఏర్పాటు చేసినా పడకలకు ఇబ్బందికరంగా మారింది. దవాఖానాలో 110 సిలిండర్లు ఉండగా యూవీకెన్‌ సంస్థ మరో 100 వితరణ చేసింది.  


సీపాప్‌ యంత్రాలు: వెంటిలేటర్‌పై ఉంచినా శ్వాస తీసుకోలేని పరిస్థితి ఉంటే సీపాప్‌ యంత్రాలు ఉపయోగిస్తారు. జిల్లా కేంద్రంలోని రెండు ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఇవి ఉండేవి. అత్యవసరమైతే హైదరాబాద్‌కు తరలించేవారు. ఈ నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు, దాతలు 31 సీపాప్‌ యంత్రాలు సమకూర్చాయి.  


అదనంగా వైద్యుల కేటాయింపు: మొన్నటి వరకు ఎస్‌ఆర్‌లు, రెగ్యులర్‌, ఒప్పంద వైద్యులు కలిపి 182 మంది కొవిడ్‌ సేవలు అందించారు. వీరితో పాటు 100 మంది హౌస్‌సర్జన్లు విధులు నిర్వర్తించారు. పీజీలు ఏడాది పాటు ఎస్‌ఆర్‌లుగా వైద్యకళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో పనిచేయాలనే నిబంధనల ఉండటంతో జిల్లాకు మరో 35 మందిని కేటాయించారు.


151 మానిటర్లు: గతంలో ప్రతి రోగికి పల్స్‌ ఆక్సిమీటర్‌ పెట్టి చెక్‌ చేసేవారు. ఇప్పుడు 151 పడకలకు(అత్యవసరమైన కేసులకు) మానిటర్లు సిద్ధంగా ఉన్నాయి. సర్కారు 31, యూవీకెన్‌ వారు 120 మానిటర్లు అందజేశారు. గుండె వేగం, బీపీ, ఆక్సిజన్‌ లెవల్స్‌ వంటి వివరాలు కనిపిస్తాయి.


అందుబాటులోకి ఆధునిక యంత్రాలు

- డాక్టర్‌ ప్రతిమారాజ్‌, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌

రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం సౌకర్యాలు మెరుగుపడ్డాయి. ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. సూదిమందులకు, మాత్రలకు కొరత లేదు. మాస్కులు, పీపీఈ కిట్లు సెంట్రల్‌ డ్రగ్‌స్టోర్‌లో సిద్ధంగా ఉన్నాయి. 18 ఏళ్లు నిండిన వారందరూ రెండు డోసుల టీకా తీసుకోవాలి.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని