logo
Published : 02/12/2021 05:47 IST

రెండో డోస్‌ వ్యాక్సిన్‌ తప్పనిసరి


వీసీలో పాల్గొన్న పాలనాధికారి నారాయణరెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, ఇతర అధికారులు

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: కొత్త వెరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ రెండో డోసు వ్యాక్సిన్‌ వేసుకోవాలని జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రజల కోసం తన సందేశాన్ని విడుదల చేశారు. ప్రాణాలు రక్షించుకోవాలంటే వ్యాక్సిన్‌ తప్పనిసరన్నారు. వ్యాక్సిన్‌ తీసుకునే విషయమై ప్రజాప్రతినిధులు, కాలనీ వెల్ఫేర్‌ సొసైటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల వారు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

నెలాఖరుకు వందశాతం పూర్తవ్వాలి

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: నెలాఖరులోగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ వందశాతం పూర్తయ్యేలా చూడాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌తో మాట్లాడారు. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, మేయర్‌ నీతూకిరణ్‌, బోధన్‌ పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ పద్మ, స్థానిక సంస్థల అదనపు పాలనాధికారి చిత్రామిశ్రా, డీఎంహెచ్‌వో సుదర్శనం, జడ్పీ సీఈవో గోవింద్‌, డీఆర్‌డీవో గోవింద్‌, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌, డీపీవో జయసుధ ఉన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని