logo
Updated : 02/12/2021 06:25 IST

బాలుడి ఆవేదన పట్టదా?

చిత్రంలోని బాలుడి పేరు అజయ్‌కుమార్‌(12). బోధన్‌ శివారులోని బెల్లాల్‌లో నివసిస్తున్నాడు. అమ్మానాన్నలు కూలీ పనులు చేస్తారు. రెండేళ్ల క్రితం అమ్మ వ్యవసాయ కూలీకి వెళ్లగా తనతో పాటు బయలుదేరాడు. పొలంలో ఆడుకుంటూ ఉండగా మొక్కజొన్న కంకుల నుంచి మక్కలను వేరు చేసే యంత్రంలో కాలు ఇరుక్కుపోయింది. ఆసుపత్రికి తీసుకెళ్తే కింది భాగం తీసేశారు. చికిత్స కోసం బాగా ఖర్చయింది. అప్పటి నుంచి దివ్యాంగుల పింఛన్‌ కోసం తిరుగుతూనే ఉన్నాడు. దరఖాస్తు చేసుకుందామంటే సదరం ధ్రువపత్రం అడుగుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే కరోనాతో కొన్ని రోజులు, ఆన్‌లైన్‌ సమస్యతో మరికొంత కాలం తిప్పించుకుంటున్నారని బాలుడు వాపోతున్నాడు. చివరకు బుధవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోని దివ్యాంగుల విభాగం అధికారులను కలవడానికి వచ్చారు. పింఛన్‌తో పాటు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్‌ ఇప్పించాలని కోరుతున్నాడు.

- ఈనాడు, నిజామాబాద్‌

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని