logo
Published : 02/12/2021 05:47 IST

కలుషితంమై.. కాలిపోతూ

నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం
న్యూస్‌టుడే, ఇందూర్‌ ఫీచర్స్‌

ప్రకృతిలో మనిషి ఒక జీవి. మిగతా వాటి కంటే విచక్షణ జ్ఞానం అదనపు వరం. తన సౌఖ్యం కోసం కూర్చున్న కొమ్మను నరుక్కుంటూ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చుకుంటున్నాడు. జీవనాధారమైన గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తూ దానిలో తానే కాలిపోతున్న తీరు భవిష్యత్తును అంధకారంగా మారుస్తోంది. ప్రకృతి వనరులు సద్వినియోగం చేసుకోవడం, వాటిని పరిరక్షించాలన్న బాధ్యతను విస్మరించి వ్యాధులు మూటగట్టుకుంటున్నాడు. నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం. ఈ సందర్భంగా మనిషిని వాయు కాలుష్యం ఎలా హరిస్తుందో తెలిపే కథనం..

భోపాల్‌లో 1984 డిసెంబరు 2-3 తేదీల్లో గ్యాస్‌ దుర్ఘటనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వారి జ్ఞాపకార్థం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. మానవ తప్పిదాలు, పారిశ్రామిక కారకాలతో గాలి, నీరు, భూమి కాలుష్యాన్ని నియంత్రించడంపై ప్రజల్లో అవగాహన పెంచడం దీని నేపథ్యం.

జిల్లాలో పరిస్థితి : ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోనూ వాహనాల సంఖ్య పెరిగింది. పరిశ్రమలు, వ్యర్థాల నిర్వహణలో లోపించిన శాస్త్రీయత, అడవుల నరికివేత, విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగం వెరసి కాలుష్యానికి కారణమవుతున్నాయి. జిల్లాలో ఆయా రంగాల కాలుష్య కారకాలు ఇలా ఉన్నాయి.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని