logo
Published : 02/12/2021 06:01 IST

చేప.. చేప.. యాడున్నవ్‌..!

కోట్లుచెరువుల్లో కనిపించట్లేదని మత్స్యకారుల ఆవేదన

నిజాంసాగర్‌ జలాశయంలో చేప పిల్లల విడుదల (పాతచిత్రం)

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ప్రభుత్వం ఏటా చెరువులు, కుంటల్లో ఉచితంగా చేపలు, రొయ్యల విత్తనాలు పంపిణీ చేపడుతోంది. దీనిపై మత్స్యకార సంఘాల సభ్యుల అవగాహన లోపం గుత్తేదారులకు కాసులు కురిపిస్తోంది. ఒక్కో చెరువులో లక్షల్లో వదిలినట్లు చెబుతుండగా.. వందలు, వేలల్లోనే కనిపిస్తున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఏటా ఇదే తంతు కొనసాగుతోంది. ఇదేమని ప్రశ్నిస్తే.. పంపిణీ చేసిన సమయంలోనే లెక్కించుకోవాలంటున్నారు.

సరిపోని లెక్క

* గతేడాది నిజాంసాగర్‌ జలాశయంలో రొయ్యపిల్లలను పంపిణీ చేసేందుకు గుత్తేదారు విత్తన సంచులు తీసుకొచ్చారు. అధికారులు పరిశీలించి ఒప్పందంలో కుదుర్చుకున్న ప్రకారం లేవని తేల్చారు. మత్స్యకారులు సంచులను పరిశీలించగా కొన్నింట్లో నీళ్లు మాత్రమే ఉన్నట్లు తేలింది.’

* ఫలానా చెరువులో ఇన్ని వేల చేపలు వదులుతున్నామని సంబంధిత అధికారులు పత్రంపై రాసిస్తున్నారు. క్షేత్రస్థాయిలో గుత్తేదారులు అంతే సంఖ్యలో వదులుతున్నారా లేదా చూడటం లేదు. ● విత్తనాన్ని వదిలేటప్పుడు సిబ్బందితో పాటు ఆయా ప్రాంతాల మత్స్యసంఘం సభ్యులు పర్యవేక్షించాలి.

* సభ్యుల సమక్షంలో చేపపిల్లలను లెక్కించి వారి సంతకం తీసుకున్న తరువాతే విడవాల్సి ఉంటుంది. వీటిని పక్కాగా పాటించడం లేదు. ● చెరువుకు సంబంధించిన మత్స్యకార సంఘాల సభ్యులతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులకు రెండ్రోజుల ముందు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

* కానీ కేవలం గంట లేదా అరగంట ముందు చెప్పి హడావిడిగా వదిలేస్తున్నారు. ● ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా జలాశయాలు నిండుగా ఉన్నాయి. చేపవిత్తనాలు వదిలినట్లు గుత్తేదారులు ప్రకటిస్తున్నారు. ఆ స్థాయిలో మాత్రం కనిపించకపోవడంతో మత్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● కొన్ని పెద్ద జలాశయాల్లో సంఘాల ప్రతినిధులే ప్రైవేటుగా కొని వదిలేందుకు సిద్ధమవుతున్నారు.

పరిమాణంపై ఆందోళన

చెరువులు, కుంటల్లో వేసిన చేపపిల్లలు మరీ తక్కువ పరిమాణంలో ఉన్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాటి ఎదుగుదల సరిగా ఉండటం లేదని, చాలావరకు చనిపోతున్నాయని వాపోతున్నారు. జిల్లాలో బొచ్చ, రోహు, మోసు, బంగారుతీగ, మ్రిగాల వంటి రకాలు పంపిణీ చేస్తున్నారు. పావుకిలోకు మించి ఎదగడం లేదని అంటున్నారు. మేలైన రకాలను పంపిణీ చేసేలా అధికారులు ప్రణాళిక సిద్ధం చేయాలని కోరుతున్నారు.

బాధ్యత సంఘాలదే.. - వెంకటేశ్వర్‌రావు, జిల్లా మత్స్యశాఖ అధికారి

చెరువుల్లో చేపల పంపిణీ పారదర్శకంగా పూర్తి చేశాం. వదిలే సమయంలో లెక్కించుకోవాల్సిన బాధ్యత మత్స్యకారుల సంఘాలదే. పంపిణీ తీరుపై రెండు దఫాలు సభ్యులకు అవగాహన కల్పించాం. విడిచేటప్పుడు వీడియో చిత్రీకరణతో పాటు ఫొటోలు తీశాం.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని