logo
Published : 02/12/2021 06:01 IST

పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గించాలి


జిల్లాకేంద్రంలో అర్ధనగ్నంగా ర్యాలీ తీస్తున్న భాజపా యువమోర్చా నాయకులు

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో బుధవారం ఆందోళనకు దిగారు. కొత్తబస్టాండు నుంచి నిజాంసాగర్‌ చౌరస్తా వరకు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్యగౌడ్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై అధిక పన్నులు వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. బీజేవైఎం రాష్ట్ర నాయకుడు నరేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు శేఖర్‌, మన్నె కృష్ణ, రమేశ్‌రెడ్డి, శివ, సంజీవరెడ్డి, పట్టణాధ్యక్షుడు నింది వేణు తదితరులు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని