logo
Published : 02/12/2021 06:01 IST

ఆస్పత్రి వసతులు మెరుగైతున్నయ్‌..

రూ.కోటిన్నర వెచ్చిస్తే సీటీస్కాన్‌ యంత్రం

 ప్రజాప్రతినిధులు చొరవ చూపితే మరిన్ని సేవలు

ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్‌

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: కొవిడ్‌-19 మొదటి, రెండో ఉద్ధృతిలో జిల్లా ఆస్పత్రిలో అవసరమైన సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందిపడ్డారు. తాత్కాలిక వసతులతోనే నెట్టుకొచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి అవస్థలు ఎదురుకాకుండా శాశ్వత వైద్య సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో కొంతమేర మెరుగైనప్పటికీ పూర్తిస్థాయిలో వసతులు సమకూర్చాల్సిన అవసరం ఉంది.

వెంటిలేటర్లు, పడకలు

రెండో దశ కొవిడ్‌ సమయంలో జిల్లా ఆసుపత్రిలో కేవలం ఐదు ఆక్సిజన్‌ పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 170 పడకలకు అందించేలా పరికరాలు అమర్చారు. ఇది వరకే ఆక్సిజన్‌ ప్లాంటు ఏర్పాటు చేశారు. దీనికి తోడుగా ఆర్టీపీసీఆర్‌ ల్యాబును అందుబాటులోకి తెచ్చారు. నిర్మాణ్‌ సంస్థకు చెందిన ప్రతినిధులు రూ.50 లక్షలు వెచ్చించి వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతోపాటు 20 పడకల ఐసీయూ గదిని సమకూర్చారు.

అందుబాటులో వైద్యులు

గతంలో సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది లేక రోగులు అవస్థలు పడేవారు. ప్రస్తుతం మత్తుమందు ఇచ్చే వైద్యులతో పాటు వెంటిలేటర్లు సిద్ధం చేసేందుకు అవసరమైన సిబ్బందిని ప్రభుత్వం నియమించింది.

పూర్తికాని మాతాశిశుసంరక్షణ కేంద్రం

ఆసుపత్రి స్థాయి పెరగడంతో రోగుల తాకిడి కూడా పెరుగుతోంది. వైద్యులు, సిబ్బంది సిద్ధంగా ఉన్నప్పటికీ పడకల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ఒకే ప్రాంగణంలో మాతాశిశువులతో పాటు ఇతర వ్యాధిగ్రస్థులకు చికిత్స చేస్తున్నారు. డిగ్రీ కళాశాల సమీపంలో మాతాశిశుసంరక్షణ కేంద్రం నిర్మాణం ప్రారంభించినప్పటికీ నిధుల కొరత కారణంగా పూర్తికాలేదు. దీనితోపాటే ప్రారంభించిన బాన్సువాడలో నిర్మాణం పూర్తయి గర్భిణులకు అందుబాటులోకి వచ్చింది.


ఆ ఒక్కటీ సమకూర్చితేనే..

అవసరమైన సౌకర్యాలన్నీ సమకూరినా కీలకమైన సీటీస్కాన్‌ యంత్రం మాత్రం అందుబాటులోకి రాలేదు. కొన్ని సందర్భాల్లో ఇందులో మాత్రమే రోగి సమస్య స్పష్టంగా తెలుస్తుంది. రూ.కోటిన్నర నిధులు మంజూరు చేస్తే కొనుగోలు చేయొచ్ఛు


ప్రతిపాదనలు పంపాం

- అజయ్‌కుమార్‌, సూపరింటెండెంట్‌, కామారెడ్డి

జిలా ఆసుపత్రిలో చాలా వసతులు సమకూరాయి. సీటీస్కాన్‌ యంత్రం కొనుగోలు నిమిత్తం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. బాన్సువాడలోనూ అన్ని పడకలకు ఆక్సిజన్‌ అందించేందుకు వీలుగా పరికరాలు సమకూర్చాం. ఎల్లారెడ్డి, దోమకొండ ఆసుపత్రుల్లో పరికరాలు బిగించే పనులు ప్రారంభించాం. ప్రజలు కొవిడ్‌ నిబంధనలు విస్మరించొద్ధు

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని