logo
Published : 02/12/2021 06:01 IST

అటవీ భూముల పరిరక్షణకు చర్యలు

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌, ఎస్పీ శ్వేత

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో అటవీ, రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులతో బుధవారం ఆయన సమీక్షించారు. అటవీ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు. గ్రామాల వారీగా అర్హులను ఎంపిక చేయాలని సూచించారు. గతంలో అధికారులపై దాడులకు పాల్పడ్డ వారిని గుర్తించి తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో రెవెన్యూ, అటవీ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి భూములు గుర్తించాలన్నారు. ఆక్రమణకు పాల్పడుతున్నట్లు సమాచారం వస్తే ఇకపై 20 మంది కలిసి బృందంగా వెళ్లాలని పేర్కొన్నారు. ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. 2018 నుంచి ఇప్పటి వరకు 30 మంది అటవీ అధికారులపై దాడులు జరుగగా 24 కేసులు నమోదయ్యాయన్నారు. సిబ్బందికి పూర్తి రక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, వెంకట మాధవరావు, డీఎఫ్‌వో నిఖిత, ఆర్డీవోలు రాజాగౌడ్‌, శ్రీను పాల్గొన్నారు.

పకడ్బందీగా దరఖాస్తుల పరిశీలన

కామారెడ్డి కలెక్టరేట్‌: ఓటరు నమోదు కార్యక్రమానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ బుధవారం నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా అన్ని బూత్‌లలో దరఖాస్తులు స్వీకరించామన్నారు. వాటిని పకడ్బందీగా పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేస్తామన్నారు. ఎన్నికల విభాగం అధికారి సాయిభుజంగరావు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని