logo
Published : 02/12/2021 06:15 IST

కబ్జాదారులకు చెక్‌

కృష్ణానగర్‌ సమీపంలోని పులాంగ్‌ వాగులో నిర్మించిన చెక్‌డ్యాం

న్యూస్‌టుడే, మాక్లూర్‌: జలసోయగంతో పంట పొలాలను ముద్దాడి, అన్నదాతలను మురిపించిన పులాంగ్‌ వాగు.. కొందరి కబంద హస్తాల్లో చిక్కుకొని నాలుగేళ్ల పాటు విలవిల్లాడింది. ఇటీవల సర్కారు స్పందించి చెక్‌డ్యామ్‌ నిర్మించడంతో వారి ఆగడాలకు అడ్డుకట్ట పడింది. సుమారు రూ.4 కోట్ల విలువైన భూమికి విముక్తి లభించింది.

అక్రమార్కుల ఆశలు నీటిపాలు

బోర్గాం నుంచి కృష్ణానగర్‌కు వెళ్లే ప్రధాన రహదారికి కూతవేటు దూరంలో పులాంగ్‌ వాగు ఉంది. దీనికి ఇరువైపులా దాదాపు 20 ఎకరాల స్థలాన్ని కొందరు ఆక్రమించుకున్నారు. బోర్లు వేసి నాలుగేళ్లపాటు పంటలు పండించారు. తామే వారసులమన్నట్లుగా భావించి అమ్మకానికీ పెట్టి అందినకాడికి దండుకోవాలని చూశారు. సర్కారు చర్యలతో వారి ఆశలన్నీ నీటి పాలయ్యాయి. కబ్జాకు గురైన స్థలానికి కొద్దిదూరంలో మూడు నెలల క్రితం రూ.3.50 కోట్లతో చెక్‌డ్యామ్‌ నిర్మించడంతో భూబకాసురుల చెరలో చిక్కుకున్న స్థలం పూర్తిగా నీట మునిగిపోయింది. వాగు పూర్వ వైభవాన్ని సంతరించుకొని నీటితో కళకళలాడుతోంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని