logo
Published : 02/12/2021 06:15 IST

స్వచ్ఛ పురస్కారం.. పల్లెకు ఉత్సాహం

న్యూస్‌టుడే, కామారెడ్డి సంక్షేమం

స్వచ్ఛగ్రామాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సంపూర్ణ పారిశుద్ధ్యంలో మెరుగైన ప్రగతి సాధించేలా ప్రోత్సహిస్తోంది. ఏటా ఆదర్శంగా నిలుస్తున్న పంచాయతీలకు నగదు పురస్కారం అందజేస్తోంది. కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ నెల 25 వరకు గ్రామ, మండల, జిల్లా పరిషత్తులు నాలుగు విభాగాల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రకటించింది. కొన్ని పంచాయతీలకు గతంలో జిల్లాస్థాయిలో అవార్డులు దక్కాయి. ఈ ఏడాది అనేక గ్రామాలు పోటీ పడుతున్నాయి. సుమారు 30పైగా పంచాయతీలు అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ లఘుచిత్రాలు రూపొందించాయి.

ల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రతి నెల పల్లెప్రగతి పేరుతో నిధులు విడుదలవుతున్నాయి. మూడు నెలలకు ఒకసారి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. పంచాయతీ నిధులతో పాటు జాతీయ ఉపాధిహామీ పథకం అనుసంధానంతో శ్మశానవాటికలు, చెత్త నిల్వ కేంద్రాలు, డంపింగ్‌ యార్డులు, ప్రకృతివనాలు రూపుదిద్దుకున్నాయి. ప్రతి గ్రామంలో సిమెంటు రోడ్డు నిర్మిస్తున్నారు. మురుగుకాల్వల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇంటింటికి ఇంకుడు గుంతలు తవ్విస్తున్నారు. ప్లాస్టిక్‌ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తడి, పొడి చెత్త సేకరణకు బుట్టలు పంపిణీ చేస్తున్నారు.

ఇలా చేయాలి

* 2020-21గాను దరఖాస్తులు ఆహ్వానిస్తున్న కేంద్రం ● ఈ నెల 25 వరకు గడువు

* 2020-21లో సాధించిన అభివృద్ధిపై panchayataward.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.

* పారిశుద్ధ్యం, తాగునీటి వసతి, వీధి దీపాలు, మౌలిక వసతులు, స్థానిక వనరులతో అభివృద్ధి తదితర విషయాలపై ఫొటోలు, దస్త్రాలు అప్‌లోడ్‌ చేయాలి

* అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంపై లఘుచిత్రాలు అందుబాటులో ఉంటే సమర్పించాలి. ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఏమైనా అవార్డులు పొంది ఉంటే ఆ వివరాలు జత చేయాలి.

* ఉపాధిహామీ పథకంలో ఎంతమందికి పని కల్పించారు..? అక్షరాస్యత పెంపునకు తీసుకుంటున్న చర్యలు, మాతాశిశు మరణాల శాతం, ప్రజల్లో సామాజిక స్పృహ తదితర అంశాల్లో ప్రతిభను సూచించే అంశాలు పూరించాలి.

రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు

కేంద్ర ప్రభుత్వం నాలుగు విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ పంచాయతీ సశక్తి కరణ్‌ పురస్కారాల్లో గ్రామ, మండల, జిల్లా పరిషత్తులకు అవకాశం కల్పించారు. నానాజీ దేశ్‌ముఖ్‌ రాష్ట్రీయ గౌరవ్‌ గ్రామసభ అవార్డు, పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక, ఛైల్డ్‌ ఫ్రెండ్లీ అవార్డుల కోసం కేవలం పంచాయతీలే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగు విభాగాల్లో దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిభా పోటీల్లో ఆదర్శంగా నిలిచే వాటికి రూ.5లక్షల- 50 లక్షల వరకు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తారు.

ఈసారైనా వచ్చేనా..?

జిల్లాలో గతేడాది ఒక్క పంచాయతీకి కూడా కేంద్ర పురస్కారం దక్కలేదు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాత్రం అనేక అవార్డులు దక్కించుకున్నాయి. ఏడాది కాలంగా గ్రామాలు అన్ని రంగాల్లో ముందంజ వేస్తున్నాయి. మౌలిక వసతులు సమకూర్చుకుంటున్నాయి. హరితహారం, శ్మశానవాటికలు, ప్రకృతివనాలు, మెరుగైన రోడ్లు, చెత్తసేకరణకు ట్రాక్టర్లు, చెత్త నిల్వ కేంద్రాలు ఉన్నాయి. కొన్ని చోట్ల తడి- పొడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నారు. మరి వీటికి ఈసారైనా నగదు పురస్కారం అందుతుందో లేదో చూడాలి. పంచాయతీలన్నీ దరఖాస్తు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని