logo
Updated : 02/12/2021 15:08 IST

ప్రధానోపాధ్యాయుడిని విధుల్లోకి తీసుకోవాలంటూ ఆందోళన

బీర్కూర్‌: మండల కేంద్రంలోని బాలికల ప్రాథమిక పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయుడు సంతోష్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్టోబరు 27వ తేదీన మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా మధ్యాహ్న భోజనం వికటించి పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భాగంగా జిల్లా ఉన్నతాధికారులు ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు. దీంతో పాఠశాల నిర్వహణ ఇద్దరు ఉపాధ్యాయిణులతో కష్టతరంగా మారిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. 340మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని జిల్లా విద్యాశాఖ అధికారులు సంతోష్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ నగేష్‌, వైస్‌ ఛైర్మన్‌ అనురాధ, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. 

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని