logo
Published : 02/12/2021 19:56 IST

చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య

బీర్కూర్‌: తాగేందుకు భార్య డబ్బులివ్వలేదన్న మద్యానికి బానిసైన భర్త మనస్తాపంతో చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీర్కూర్‌ మండలం చించొళ్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చించొళ్లికి చెందిన బేగరి సాయిలు(35) పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. అతిగా మద్యానికి బానిసై తాగుడుకు భార్య డబ్బులివ్వలేదని మనస్తాపం చెంది గ్రామ శివారులోని ఊర చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు వెలికితీసి శవపరీక్ష నిమిత్తం బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సాయిలుకు ఇద్దరు కుమార్తెలున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని