logo
Published : 03/12/2021 03:18 IST

వీఆర్‌ఏ మృతి

బోధన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: పెగడాపల్లికి చెందిన వీఆర్‌ఏ హర్షవర్ధన్‌(25) జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తిచెంది రెండు రోజుల క్రితం ఇంట్లో పురుగు మందు తాగారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


మహారాష్ట్ర దేశీదారు పట్టివేత

బోధన్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: సాలూర శివారులో గురువారం ఆబ్కారీ అధికారులు మహారాష్ట్ర దేశీదారు పట్టుకొన్నారు. రుద్రూర్‌ మండలం రాణంపల్లికి చెందిన గంగాధర్‌ మహారాష్ట్ర నుంచి ద్విచక్రవాహనంపై తీసుకొని బోధన్‌ వైపునకు వస్తుండగా అదుపులోకి తీసుకొన్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ బాలరాజు తెలిపారు.


నలుగురు దొంగలకు జైలు శిక్ష

నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే: సులభంగా డబ్బు సంపాదించేందుకు ద్విచక్రవాహనాలు దొంగిలిస్తున్న నలుగురికి జైలు శిక్ష విధిస్తూ నిర్మల్‌ న్యాయస్థానం తీర్పునిచ్చింది. న్యాయస్థాన పోలీసు లైజన్‌ అధికారి, ఎస్సై సక్రియానాయక్‌ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నిర్మల్‌ గ్రామీణ మండలం చిట్యాల్‌ గ్రామంలో సంపత్‌రెడ్డికి చెందిన ద్విచక్రవాహనం గత సంవత్సరం సెప్టెంబరు 11న ఇంటి ముందు ఉండగా అపహరణకు గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన కొనుగుల రాజు, కత్తుల ప్రశాంత్‌, నందిపేట్‌ మండలం నడికుడ గ్రామానికి చెందిన గంగాకిషన్‌, నిజామాబాద్‌కు చెందిన పుప్పాల రాములు అనుమానితులుగా పట్టుబడ్డారు. వీరిపై కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లోనూ 16 దొంగతనాలు నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను న్యాయస్థానంలో హాజరుపర్చగా చేసిన నేరం రుజువైంది. దీంతో వీరికి 11 నెలల జైలు శిక్ష విధిస్తూ అదనపు న్యాయమూర్తి అనూష గురువారం తీర్పునిచ్చారు.

సమాచారం ఇవ్వాలి.. ఇందూరు సిటీ: అసాంఘిక కార్యకలాపాలపై ఎలాంటి సమాచారం ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని నిజామాబాద్‌ ఏసీపీ ఆరె వెంకటేశ్వర్‌ ప్రజలను కోరారు. నగరంలోని మూడోఠాణా పరిధిలో ఉన్న రైల్వే పరిసర ప్రాంతాల్లో గురువారం రాత్రి తనిఖీలు జరిపారు. బహిరంగంగా మద్యం తాగుతున్న వారిని, అనుమానంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించారు. దొంగతనాలు, ఇతర నియంత్రణలో భాగంగా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నట్లు ఏసీపీ తెలిపారు. నగర సీఐ సత్యనారాయణ, ఎస్సైలు సంతోష్‌కుమార్‌, సాయినాథ్‌, సందీప్‌ ఉన్నారు.


Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని