logo
Published : 03/12/2021 03:18 IST

అటవీ సిబ్బందిపై దాడులు సహించం : కలెక్టర్‌

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, పాల్గొన్న ఎస్పీ శ్వేత,

డీఎఫ్‌వో నిఖిత, అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ధోత్రే, డీఎస్పీ శశాంక్‌రెడ్డి

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: అడవులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న అధికారులపై దాడులకు పాల్పడితే సహించేది లేదని పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం ఎస్పీ శ్వేత, డీఎఫ్‌వో నిఖిత, అదనపు పాలనాధికారి వెంకటేశ్‌ధోత్రే, ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. గత నెల 29న లింగంపేట మండలం ముంబోజిపేటతండాలో కొండాపూర్‌ సెక్షన్‌ పరిధిలో అధికారులు మహేశ్‌, ఫిరోజ్‌ఖాన్‌లపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేసి నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశామన్నారు. తరచూ అటవీ సంపదను నాశనం చేసే వారిపై పీడీ చట్టం ప్రయోగిస్తామని తెలిపారు. హక్కుపత్రాల కోసం పోడు రైతులు పెట్టుకున్న దరఖాస్తులను ఆన్‌లైన్‌ చేస్తున్నామన్నారు. అధికారులపై దాడిలో పాల్గొన్నవారంతా యువకులేనని పేర్కొన్నారు. అటవీ భూముల ఆక్రమణల్లో పాల్గొని భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు.

ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌

ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. అటవీ ఆక్రమణలు అడ్డుకునేందుకు ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అటవీ అధికారులపై దాడి చేసిన వారిలో హన్మంత్‌, సాయిలు, లక్ష్మయ్య, గణేశ్‌, లవకుమార్‌, సాయిలును అరెస్టు చేయగా.. మరో నిందితుడు పోచయ్య పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. డీఎఫ్‌వో నిఖిత మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 22శాతం అడవులను కాపాడిల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. హక్కుపత్రాలు వస్తాయనే ఆశతో కొత్తగా చెట్లు నరికి పోడు చేపట్టడం తగదన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2005 డిసెంబరు 13కు పూర్వం సాగులో ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తరువాత బాన్సువాడ, పిట్లం, గాంధారి, నస్రుల్లాబాద్‌, లింగంపేట తదితర ప్రాంతాల్లో ఆక్రమణలను గుర్తించినట్లు తెలిపారు. అందుకు కారకులపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని