logo
Published : 03/12/2021 03:18 IST

పర్యావరణ హితమే లక్ష్యం .. ఆవిష్కరణలే మార్గం

న్యూస్‌టుడే, బాన్సువాడ పట్టణం

విద్యార్థుల ఆవిష్కరణను పరిశీలిస్తున్న జిల్లా సైన్స్‌ అధికారి(పాత చిత్రం)

విద్యార్థుల్లోని సృజనాత్మకతను, వారిలోని ప్రతిభను వెలికితీసి పర్యావరణహిత ఆవిష్కరణలు రూపొందించేందుకు ‘సాంకేతిక మరియు బొమ్మలు’ అనే అంశంతో జిల్లా స్థాయి సైన్స్‌, మ్యాథ్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ఎగ్జిబిషన్‌ను(డీఎస్‌ఎల్‌ఎస్‌ఎమ్‌ఈఈ) నిర్వహించే విధంగా ఎన్‌సీఈఆర్‌టీ ఆదేశాలనిచ్చింది. కొన్ని ఉప అంశాలను అందులో సూచించడంతో ఆ మేరకు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తును ప్రారంభించింది. మేలు చేసేలా... పర్యావరణాన్ని పరిరక్షించే ముఖ్య ఉద్దేశంతో టెక్నాలజీ అండ్‌ టాయ్స్‌ అనే ప్రధానాంశంతో విద్యార్థులతో ప్రదర్శనను ఏర్పాటు చేయనున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్బిన వారికి రాష్ట్ర స్థాయి ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

ఉప అంశాలు ఇవి...●

* పర్యావరణహిత వస్తువుల తయారీ

* ఆరోగ్యం - పరిశుభ్రత

* సాఫ్ట్‌వేర్‌ - యాప్స్‌ ● రవాణా...

* వాతావరణ మార్పులు ● గణితం

ఈ అంశాలపై విద్యార్థులు ఆవిష్కరణలు చేయొచ్ఛు జిల్లా స్థాయిలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు పాల్గొనే అవకాశం కల్పించారు.

సద్వినియోగం చేసుకోవాలి: సిద్ధిరాంరెడ్డి, జిల్లాసైన్స్‌ అధికారి

ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పర్యావరణహిత వస్తువులు, ఆవిష్కరణలు తయారు చేసే విధంగా సిద్ధమవ్వాలి. ఉత్తమ ఆవిష్కరణలను రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించే అవకాశం ఉంటుంది. జిల్లా ప్రదర్శన తేదీలు త్వరలో ప్రకటిస్తాం.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని