logo
Published : 03/12/2021 03:18 IST

జరిమానా జేబులోకే..!

వసూలు చేసిన డబ్బులు జమ చేయని సిబ్బంది

పారిశుద్ధ్య విభాగంలో అవినీతి బాగోతం

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం

అక్రమార్కులు ఎందెందు వెతికినా.. అందందే కలరు.. అన్న చందంగా మారింది నిజామాబాద్‌ నగరపాలక సంస్థ పరిస్థితి. అక్రమార్జనకు అలవాటు పడినవారు ఏ మార్గంలో ఎంత దొరికితే అంత దండుకుంటున్నారు. పారిశుద్ధ్య విభాగంలో భారీగా జరిమానా నగదు స్వాహాపర్వం తాజాగా బయటపడింది.

రహదారిపై చెత్త వేసిన వారికి.. తనిఖీల సమయంలో పాలిథిన్‌ దొరికితే నగర పాలక సంస్థ పారిశుద్ధ్య విభాగం వారు జరిమానా విధిస్తుంటారు. వీటిని సంస్థ ఖాతాలో జమ చేయాల్సి ఉండగా.. ఎవరికి వారే జేబులో వేసుకుంటున్నారు. డిప్యూటీ కమిషనర్‌ రవిబాబుకు ఆరోగ్య అధికారిగా అదనపు బాధ్యతలు ఇటీవలే అప్పగించగా.. ఈ అక్రమం వెలుగు చూసింది.

పర్యవేక్షణ కొరవడి

నగర పాలక సంస్థలో పారిశుద్ధ్య విభాగం కీలకమైంది. పరిసరాలు పరిశుభ్రం చేయడం, చెత్త సేకరణ, మురుగు కాల్వలు బాగు చేయడం వంటి పనులు పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఈ విభాగం గాడి తప్పింది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు.

కొన్ని నెలలుగా లెక్కలు లేవు

ఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టిన డిప్యూటీ కమిషనర్‌ రవిబాబు రసీదు పుస్తకాలు తనిఖీ చేస్తే.. ప్రజలు, వ్యాపారుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేసిన డబ్బులు బల్దియా ఖాతాలో జమ చేయలేదనే విషయంలో బయటపడింది. కొన్ని నెలలుగా డబ్బుల లెక్కలు లేవని గుర్తించారు. రసీదు పుస్తకం అయిపోతే గణాంక విభాగానికి అప్పజెప్పకుండా తమ వద్దే అట్టిపెట్టుకున్నారు.

అంతా ఇన్‌ఛార్జులే..

నగరంలో ఐదు జోన్లు ఉన్నాయి. ఒక్కోదానికి ఒక్కో పారిశుద్ధ్య పర్యవేక్షకుడు ఉండాలి. ప్రస్తుతం అన్నిచోట్ల ఆరోగ్య సహాయకులే ఇన్‌ఛార్జులుగా ఉన్నారు.

పుస్తకాలు మాయం

జరిమానా స్వాహాపర్వం ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేస్తోంది. వసూలు చేసిన దానికి లెక్కలు లేవు. కొందరు రసీదు పుస్తకాలు కనిపించకుండా దాచేస్తున్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వాడుకున్న డబ్బులు జమ చేయాలని ఇన్‌ఛార్జి ఎంహెచ్‌వోగా ఆదేశాలు జారీ చేయడంతో విభాగం సిబ్బంది ఇప్పుడు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే ఒక్కరిద్దరు పారిశుద్ధ్య పర్యవేక్షకులు రూ.2 లక్షల వరకు బల్దియాకు జమ చేసినట్లు తెలిసింది. ఇంక ఎందరు ఎంత మేర కాజేశారో తెలియని పరిస్థితి శాఖలో ఉంది.

చెల్లించాలని ఆదేశించాం

- రవిబాబు, ఇన్‌ఛార్జి ఎంహెచ్‌వో, నగర పాలక సంస్థ

ప్రజలు, వ్యాపారుల నుంచి జరిమానా రూపంలో వసూలు చేసిన డబ్బులు, రసీదు పుస్తకాలు పరిశీలించగా సరిగా జమ చేయలేదని తేలింది. లెక్కలు తీస్తున్నాం. సొంతానికి వాడుకున్న డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో బల్దియాకు చెల్లించాలని ఆదేశించాం. ఇప్పుడిప్పుడే జమ చేస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని