logo
Published : 03/12/2021 03:18 IST

గిరి ప్రదక్షిణం.. సప్త హారతి

రథం ఊరేగింపులో పాల్గొన్న భక్తులు

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్మూర్‌ నవనాథ సిద్ధులగుట్ట గిరి ప్రదక్షిణ గురువారం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. సిద్ధేశ్వరుడు, సీతారాములు, లక్ష్మణ- ఆంజనేయ, అయ్యప్ప ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించారు. పలుగుట్ట మంగి రాములు, సిద్ధులగుట్ట నందీశ్వర మహరాజ్‌లు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గుట్ట చుట్టూ ఆలూరు రోడ్డు, కాశీహనుమాన్‌ వీధి, జెండా గుడి, ముదిరాజ్‌ సంఘం, గోల్‌బంగ్లా, జంబీహనుమన్‌ ఆలయం, అంబేడ్కర్‌ చౌరస్తాలో సప్తహారతి ఇచ్చారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై మంగళహారతులు ఇచ్చారు. తెరాస నియోజకవర్గ ఇన్‌ఛార్జి రాజేశ్వర్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు ఏనుగు శేఖర్‌ రెడ్డి, పుర ప్రముఖులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని