logo
Published : 03/12/2021 03:18 IST

సరిహద్దుపై కన్నేద్దాం

రెండో డోసు తీసుకుంటేనే అనుమతించాలి

న్యూస్‌టుడే, నిజామాబాద్‌

వైద్యవిభాగం, బోధన్‌ పట్టణం

మహారాష్ట్ర సరిహద్దులో సలాబత్‌పూర్‌ అంతర్రాష్ట్ర

చెక్‌పోస్టు వద్ద గతేడాది ప్రయాణికులను పరీక్షిస్తున్న వైద్య సిబ్బంది

కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండలం సలాబత్‌పూర్‌, నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం పోతంగల్‌, బోధన్‌ మండలం సాలూర, ఖండ్‌గావ్‌, రెంజల్‌ మండలంలో కందకుర్తి సరిహద్దులున్నాయి. రెండో దశలో ఈ సరిహద్దు కేంద్రాల వద్ద పోలీసు, వైద్యఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో మొదట బస్సులు తనిఖీలు చేశాయి. వైరస్‌ తీవ్రత పెరగడంతో ద్విచక్రవాహనాలనూ వదల్లేదు. లక్షణాలు ఉన్న వారికి కొవిడ్‌ పరీక్షలు జరిపారు. తాజాగా ‘ఒమిక్రాన్‌’ ముప్పు పొంచి ఉండటం, దేశ వ్యాప్తంగా నాలుగు రోజులుగా కొవిడ్‌ కేసులు, మరణాలు పెరుగుతుండటంతో మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. సరిహద్దుల్లో మళ్లీ ఆరోగ్యశాఖ చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలి.

●రెండో దశ కొవిడ్‌ విజృంభించిన సమయంలో మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దులో మొదట్లో థర్మామీటర్‌తో స్కీనింగ్‌ చేసి వదిలేశారు. తర్వాత మహారాష్ట్ర వేరియంట్‌ ప్రమాదకరంగా ఉందని మరణాల శాతం ఎక్కువుందని తేలడంతో అప్రమత్తమై ర్యాపిడ్‌ పరీక్షలు ప్రారంభించారు. ప్రారంభంలోనే అప్రమత్తమై ర్యాపిడ్‌ పరీక్షలు చేసి ఉంటే జిల్లాకు రెండో దశ ముప్పు కొంత తగ్గి ఉండేది. అదే తప్పు మళ్లీ ఈ మూడో దశలో చోటుచేసుకోకుండా చూడాల్సిన అవసరం వైద్యఆరోగ్యశాఖపై ఉంది.

ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల్లేవు

- సుదర్శనం, జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి

మహారాష్ట్ర సరిద్దులో ఇప్పటి వరకు ఎక్కడా తనిఖీ కేంద్రం ఏర్పాటు చేయలేదు. ఉన్నతాధికారుల నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు లేవు. జిల్లా పాలనాధికారితో శుక్రవారం సమావేశం ఉంది. ఇందులో చర్చించి సరిహద్దుల్లో ఏం చేయాలో నిర్ణయిస్తాం.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని