logo

దివ్యాంగులను ఆదుకుంటున్నాం

రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునేందుకు పలు రకాల పథకాలు అమలు చేస్తూ అండగా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త అంబేడ్కర్‌ భవన్‌లో మహిళా శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో

Published : 05 Dec 2021 05:33 IST


బ్యాటరీతో నడిచే వీల్‌ఛైర్లు అందిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులను ఆదుకునేందుకు పలు రకాల పథకాలు అమలు చేస్తూ అండగా ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త అంబేడ్కర్‌ భవన్‌లో మహిళా శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో 18,470 దివ్యాంగుల పింఛన్‌ కోసం రూ.5 కోట్ల వరకు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. దివ్యాంగులను అవమానిస్తే కేసు నమోదు చేయాలన్నారు. కలెక్టర్‌ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. రోశయ్య మృతికి మంత్రి సంతాపం వ్యక్తం చేశారు. దివ్యాంగులకు ల్యాప్‌టాప్‌లు, బ్యాటరీతో నడిచే వీల్‌ఛైర్లు, స్కూటీలు పంపిణీ చేశారు. జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, ఎమ్మెల్సీ వీజీగౌడ్‌, మేయర్‌ నీతూకిరణ్‌, మహిళా కమిషన్‌ సభ్యురాలు సూదం లక్ష్మి, అదనపు డీసీపీ అరవింద్‌, డీపీవో జయసుధ, డీఆర్‌డీవో చందర్‌, సంక్షేమ శాఖ అధికారిణి ఝాన్సీ, జడ్పీటీసీ సభ్యుడు జగన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని