logo
Published : 05/12/2021 06:00 IST

ధాన్యం దిగుమతికి ఐదుగురు మిల్లర్లు ససేమిరా

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: వానాకాలం సీజన్‌ ప్రారంభం నుంచి మిల్లర్లు ధాన్యం సేకరణకు కొర్రీలు పెడుతున్నారు. తాజాగా ఎల్లారెడ్డి డివిజన్‌లోని ఐదు రైసుమిల్లుల నిర్వాహకులు చేతులెత్తేశారు. ధాన్యం దిగుమతిని నిరాకరించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే రెండు దఫాలు మిల్లర్లతో సమావేశాలు నిర్వహించిన పౌరసరఫరాలశాఖ అధికారులు ఉన్నతాధికారులకు నివేదించారు. ఎల్లారెడ్డి డివిజన్‌లో మొత్తం 27 మిల్లులు ఉండగా.. బాయిల్డ్‌ 2, రా 25 ఉన్నాయి. బాన్సువాడ, కామారెడ్డి డివిజన్ల పరిధిలో ధాన్యం సేకరణ ముగింపు దశకు చేరుకుంది. ఎల్లారెడ్డిలో మాత్రమే మిగిలింది. ఏ డివిజన్‌ పరిధిలోని ధాన్యాన్ని అక్కడి మిల్లులకే కేటాయించారు. ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ట్రాన్స్‌పోర్టర్లు ముందుకు రావడం లేదు. రైతులు కేంద్రాల్లో నెల రోజులుగా పడిగాపులు కాస్తున్నారు. ఈ తరుణంలో అదును చూసి ధాన్యం దిగుమతిపై ఆంక్షలు విధించినట్లు సమాచారం.

ఉన్నతాధికారులకు నివేదించాం - రాజశేఖర్‌, డీఎస్‌వో, కామారెడ్డి

ఐదుగురు మిల్లర్లు నిర్దేశిత ధాన్యం దిగుమతికి నిరాకరిస్తున్నారు. వారితో సమావేశం నిర్వహించి కట్టుబాటును గుర్తుచేశాం. ఇలా చేస్తే వానాకాలం సీజన్‌లో తక్కువ కేటాయింపులు చేస్తామని వెల్లడించాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని