logo

కూలీలకు ఉపాధి కల్పించాలి

శ్రమశక్తి సంఘాల ద్వారా పనులు గుర్తించి కూలీలకు ఉపాధి కల్పించాలని పాలనాధికారి పేర్కొన్నారు. శనివారం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో నర్సరీని పరిశీలించి మాట్లాడారు. పూలు, పండ్ల మొక్కలతో పాటు నీడనిచ్చే వాటిని ఎక్కువగా నాటాలని సూచించారు.

Published : 05 Dec 2021 06:00 IST

సదాశివనగర్‌, న్యూస్‌టుడే: శ్రమశక్తి సంఘాల ద్వారా పనులు గుర్తించి కూలీలకు ఉపాధి కల్పించాలని పాలనాధికారి పేర్కొన్నారు. శనివారం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో నర్సరీని పరిశీలించి మాట్లాడారు. పూలు, పండ్ల మొక్కలతో పాటు నీడనిచ్చే వాటిని ఎక్కువగా నాటాలని సూచించారు. గ్రామంలో 10 వేల మొక్కలను ఇంటింటికి పంపిణీ చేసి ఏపుగా పెరిగేలా చూడాలన్నారు. మర్రి, వేప, గానుగ, మామిడి, మోదుగ మొక్కలను పెంచాలన్నారు. ఈ-శ్రమ్‌ ద్వారా కూలీలకు బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఎంపీడీవో రాజ్‌వీర్‌, సర్పంచి జానకి, ఉపసర్పంచి లక్ష్మీపతి, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

గోదాముల పరిశీలన

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో ఈవీఎంలు నిల్వ ఉంచిన గోదాములను పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ శనివారం పరిశీలించారు. రికార్డులు తనిఖీ చేశారు. బందోబస్తు వివరాలపై ఆరా తీశారు. ఎన్నికల విభాగం అధికారి సాయిభుజంగరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని