logo

నృసింహుడి సన్నిధికి పోటెత్తిన భక్త జనం

జానకంపేటలోని నృసింహుడి సన్నిధికి భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం అమావాస్యను పురస్కరించుకుని అష్టముఖి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. అష్ట దిక్పాలకులకు నవధాన్యాలు

Published : 05 Dec 2021 06:00 IST


కోనేరులో వద్ద భక్తుల సందడి

ఎడపల్లి, న్యూస్‌టుడే: జానకంపేటలోని నృసింహుడి సన్నిధికి భక్తులు భారీగా తరలివచ్చారు. శనివారం అమావాస్యను పురస్కరించుకుని అష్టముఖి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. అష్ట దిక్పాలకులకు నవధాన్యాలు సమర్పించి దోష నివారణ చేసుకున్నారు. పుణ్యస్నానాలు చేసిన భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో చక్రతీర్థం(జాతర) కొనసాగింది. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని