logo

పే స్కేల్ అమలు చేయాలని వీఆర్‌ఏల ఆందోళన

పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం

Updated : 05 Dec 2021 19:09 IST

బీర్కూరు : పే స్కేల్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్‌ఏలు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్‌ఏల మండల సంఘం అధ్యక్షుడు గంగాధర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం తమకు పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటి వరకు అమలుకు నోచుకోకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. పే స్కేల్‌ అమలు చేయకపోవడంతో మనస్తాపం చెంది మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌ వీఆర్‌ఏ చల్లా రమేశ్‌ ఆత్మహత్య చేసుకున్నాడని, వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు రవి, ప్రధాన కార్యదర్శి విజయ్‌, సలహాదారుడు గౌస్‌, సభ్యులు మోహన్‌, అంబయ్య, వీరేశం, పోశవ్వ, రుక్కవ్వ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని