logo
Published : 09/12/2021 03:15 IST

నమోదుకు 7054... తొలగింపునకు 13,026

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

టర్ల జాబితా సంక్షిప్త సవరణకు జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి 21 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. ఆన్‌లైన్‌లో 5,845 రాగా, మిగతా 15,844 బీఎల్వోలు, తహసీల్దార్‌ కార్యాలయాల్లో నేరుగా అందించారు. వీటిలో అధికంగా ఓటు తొలగించాలని కోరుతూ వచ్చినవే ఉండటం విశేషం.
* 5న తుది జాబితా : ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టింది. నవంబరు 1 నుంచి 30 వరకు ఓటు నమోదు, తొలగింపు, సవరణ, మార్పులకు దరఖాస్తులు ఆహ్వానించింది. 2022 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని సూచించింది. జిల్లా వ్యాప్తంగా అరకొరే స్పందన వచ్చింది. ఇటీవల ఓ డిగ్రీ కళాశాలలో ఓటు నమోదుకు దూరంగా ఉన్నవారి వివరాలు ఆరా తీయగా మెజారిటీ విద్యార్థులు నమోదు చేసుకోనట్లు చెప్పారు. వచ్చే ఏడాది జనవరి 5న నియోజకవర్గాల వారీగా ఓటరు తుది జాబితా ప్రచురించనున్నారు.
* ఒకేఒక్క ఎన్‌ఆర్‌ఐ  : జిల్లాలో ఓటు నమోదుకు 7,054 దరఖాస్తులు అందగా.. తొలగించేందుకు 13,026, పేరు మార్పునకు 1,457 అందాయి. నియోజకవర్గాల మార్పునకు 152 రాగా ఫారం-6(ఎ)లో ప్రవాస భారతీయుల(ఎన్‌ఆర్‌ఐ) ఓటు నమోదుకు కామారెడ్డి నియోజకవర్గానికి ఒకేఒక్క దరఖాస్తు వచ్చింది.
కొనసాగుతున్న పరిశీలన : ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అందిన దరఖాస్తులను పోలింగ్‌ కేంద్రం పరిధిలోని బీఎల్వో స్థాయి నుంచి పరిశీలించి నివేదిక ఇస్తారు. ఇప్పటికే స్క్రూటినీ కొనసాగుతోంది. ప్రస్తుతం తొలగింపు కోసం వచ్చిన వాటిని క్షుణ్ణంగా చూస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని