logo
Published : 09/12/2021 03:15 IST

మత్స్యకారుల హైటెక్‌ ఆలోచన

పడవలో తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, సర్పంచి సాగర్‌, మత్స్యకారులు

నందిపేట్‌, న్యూస్‌టుడే: తాము పెంచుతున్న చేపలను దొంగతనంగా పట్టుకెళ్తూ జీవనోపాధికి అవరోధాలు సృష్టిస్తున్న వారి ఆట కట్టించేందుకు హైటెక్‌ ఆలోచన చేశారు నందిపేట్‌ మండలం ఖుదావంద్‌పూర్‌ మత్స్యకారులు. ఈ చెరువులో ప్రతి సీజన్‌లో సుమారు 5 లక్షల చేప పిల్లలు వదులుతున్నారు. ఏటా లక్ష కిలోల వరకు విక్రయిస్తున్నారు. చెరువు విస్తీర్ణం పెద్దగా ఉండటంతో నిత్యం ఏదో ఒక మూలన దొంగచాటున పట్టుకెళ్తున్నారు. వారిని ఒడ్డు నుంచి గుర్తిస్తున్నా.. అక్కడికి చేరుకునేలోపు జారుకుంటున్నారు. దీంతో గ్రామ మత్స్యకారులు బోటు సాయంతో గస్తీ నిర్వహించాలని నిర్ణయించారు. మత్స్య సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.2 లక్షలు వెచ్చించి ఇంధనంతో నడిచే పడవ కొనుగోలు చేశారు. వంతుల వారీగా కాపలా కాస్తున్నారు. నిర్వహణ భారం సంఘంపై పడకుండా అధికారుల అనుమతితో చెరువులో బోటింగ్‌ నిర్వహించి ఆదాయం పొందాలని భావిస్తున్నారు. తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, సర్పంచి ఎర్రొల్ల సాగర్‌, నాయకులు ప్రవీణ్‌గౌడ్‌, సాయిలు తదితరులు దీని సాధ్యాసాధ్యాలపై ఆరా తీశారు. తమ జీవనోపాధికి సాంకేతికతను వినియోగించుకోవాలనే ఆలోచనను పలువురు ప్రశంసిస్తున్నారు.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని