logo

‘మానసిక వేధింపులు తగవు’

కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని తెవివి దక్షిణ ప్రాంగణం ఫిజిక్స్‌ విభాగం ఒప్పంద అధ్యాపకులు సరిత, శ్రీమాత అన్నారు.

Published : 09 Dec 2021 03:15 IST

ప్రిన్సిపల్‌ కుర్చీకి వినతిపత్రం ఇస్తున్న ఫిజిక్స్‌ ఒప్పంద అధ్యాపకురాళ్లు సరిత, శ్రీమాత

భిక్కనూరు, న్యూస్‌టుడే: కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తూ మానసిక వేధింపులకు గురిచేస్తున్నారని తెవివి దక్షిణ ప్రాంగణం ఫిజిక్స్‌ విభాగం ఒప్పంద అధ్యాపకులు సరిత, శ్రీమాత అన్నారు. బుధవారం ఈ విషయంపై ప్రిన్సిపల్‌కు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లగా.. ఎవరూ లేకపోవడంతో ఖాళీ కుర్చీకి పెట్టి నిరసన తెలిపారు. తమ నియామకం పాలకమండలి ఆమోదంతో నిబంధనల ప్రకారమే జరిగిందన్నారు. విభాగాధిపతి ఆదేశాలతోనే ఓ విద్యార్థి దీక్ష పేరుతో తమ పరువుకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. గతంలోనూ ఇదే విధంగా వేధింపులకు గురి చేయడంతో అప్పటి ఒప్పంద అధ్యాపకులు వెళ్లిపోయారని చెప్పారు. మహిళలపై తప్పుడు ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని