logo

ఒకే పోస్టు.. ఇద్దరు అధికారులు

నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి(ఎంహెచ్‌వో) పోస్టు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక సిబ్బంది సతమతమవుతున్నారు.

Published : 09 Dec 2021 03:15 IST

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగరం: నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి(ఎంహెచ్‌వో) పోస్టు కోసం ఇద్దరు పోటీ పడుతున్నారు. ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక సిబ్బంది సతమతమవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గతంలో ఆరోగ్య అధికారిగా పనిచేసిన శ్రీనివాస్‌ బదిలీ కావడంతో నగర పాలక సంస్థ కార్యాలయ కార్యదర్శి ప్రభాకర్‌ను ఇన్‌ఛార్జి ఆరోగ్య అధికారిగా నియమించారు. ఆయన కొన్నిరోజుల తర్వాత అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. పారిశుద్ధ్య పనులు కొనసాగడం కోసం డిప్యూటీ కమిషనర్‌ రవిబాబుకు ఎంహెచ్‌వోగా అదనపు బాధ్యతలు ఇస్తూ కమిషనర్‌ నిర్ణయం తీసుకున్నారు. కాగా సెలవుపై వెళ్లిన ప్రభాకర్‌ మంగళవారం విధుల్లో చేరి పలు ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్‌ సూచన మేరకు పాఠశాలల్లో స్వచ్ఛ సర్వేక్షణపై విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చారు. మరో వైపు డిప్యూటీ కమిషనర్‌ రవిబాబు ఇన్‌ఛార్జి ఆరోగ్య అధికారిగా... పారిశుద్ధ్య పనులకు సంబంధించి వివరాలు తనకు పంపాలని ఆదేశిస్తున్నారు. ఈ విషయమై డిప్యూటీ కమిషనర్‌ రవిబాబును ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. కమిషనర్‌ తనకు ఇన్‌ఛార్జి ఎంహెచ్‌వోగా బాధ్యతలు ఇచ్చారన్నారు. రద్దు చేస్తున్నట్లు ఎలాంటి ఆదేశాలు లేవన్నారు. ప్రభాకర్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని