logo

తనిఖీలెక్కడ?

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడటంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యాధికారులను అప్రమత్తం చేసింది. కేసులు నమోదు కాకుండా కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Published : 09 Dec 2021 03:43 IST

మహారాష్ట్ర నుంచి రోజూ 2 వేల మంది రాక
న్యూస్‌టుడే - ఇందూరు సిటీ

నిజామాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయటికొస్తున్న ప్రయాణికులు

దేశంలో ఒమిక్రాన్‌ కేసులు బయటపడటంతో రాష్ట్ర ప్రభుత్వం వైద్యాధికారులను అప్రమత్తం చేసింది. కేసులు నమోదు కాకుండా కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. అయితే రాష్ట్ర సరిహద్దులు దాటి వస్తున్న ప్రయాణికుల విషయంలో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టట్లేదు. రైళ్లల్లో మహారాష్ట్ర నుంచి నిజామాబాద్‌కు నిత్యం 2 వేల మంది వస్తున్నా.. స్టేషన్‌లో తనిఖీలు చేయట్లేదు.

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌ నిత్యం ముంబయి నుంచి నిజామాబాద్‌ మీదుగా సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. ఇందులో ప్రయాణించే వారిలో 70 శాతం మంది నాందేడ్‌, నిజామాబాద్‌, కామారెడ్డి స్టేషన్లలో దిగిపోతున్నారు.

ప్రస్తుతం మహారాష్ట్ర మార్గంలో 10 రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఎక్కువ మంది ప్రయాణికులు కనీస విధిగా మాస్కులు ధరించట్లేదు. రైల్వేస్టేషన్లలో శానిటైజర్లు లేదా స్కానింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.

టికెట్‌ కౌంటర్ల దగ్గర నుంచి ప్లాట్‌ఫాంలపై వేచి చూసే వారు కొవిడ్‌ నిబంధనలు పాటించట్లేదు.

 రైల్వేశాఖ వారు కేవలం శానిటైజేషన్‌పై మాత్రమే దృష్టి సారించారు. 

కొవిడ్‌ ఒకటి, రెండో దశ ఉద్ధృతి మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉంది. అక్కడే ఎక్కువ కేసులు, మరణాలు నమోదయ్యాయి. ఆ ప్రభావం జిల్లాపై కూడా పడిన నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని