logo

స్థలం మీది.. నిర్మాణం ప్రభుత్వానిది

సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పథకాన్ని ప్రారంభించనుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను బుధవారం లబ్ధిదారులకు

Published : 09 Dec 2021 03:43 IST

వేల్పూర్‌, న్యూస్‌టుడే: సొంత స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త పథకాన్ని ప్రారంభించనుందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వేల్పూర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను బుధవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇది ఇక్కడితో ఆగిపోదని, విడతల వారీగా పేదలకు కట్టిస్తూనే ఉంటామన్నారు. ఒక్క వేల్పూర్‌లోనే రూ.7 కోట్లు వెచ్చించి 112 ఇళ్లు కట్టించామని వెల్లడించారు. ఎక్కడా భేదం చూపకుండా నిజాయతీగా లబ్ధిదారులను ఎంపిక చేశారని, కొందరు పనిగట్టుకొని పేదలను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, భాజపా పాలిత రాష్ట్రాల్లో ఒక్క ఇంటిని నిర్మించలేదని ఎద్దేవా చేశారు. మంచి పనులను చెడగొట్టే వారికి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు జేబులు నింపుకొని ఇందిరమ్మ కాలనీలు కట్టారని, వారు వాస్తవంగా లబ్ధి చేకూర్చి ఉంటే ఇంత మంది ఇళ్లులేనివారు ఎలా ఉంటారని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మిగతావారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఎంపికైన లబ్ధిదారులతో మంత్రి గృహప్రవేశం చేయించి పాలు పొంగించారు. గృహ సముదాయానికి కేసీఆర్‌ కాలనీగా నామకరణం చేశారు. గుత్తేదారు వంశీని మంత్రి సన్మానించారు. కార్యక్రమంలో డీసీవో సింహాచలం, ఆర్డీవో శ్రీనివాస్‌, ఎంపీపీ భీమా జమున, సర్పంచి తీగల రాధ, వైస్‌ ఎంపీపీ సురేష్‌, ఎంపీటీసీ సభ్యుడు మహేష్‌, సత్యం, మోహన్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని