logo

నీ స్ఫూర్తికి వందనం

రాక్షస సంహారం అనగానే ఆదిపరాశక్తి గుర్తుకొస్తుంది. సహనం అంటే భూదేవితో పోలుస్తాం. భర్త ప్రాణం కోసం పోరాటమంటే సతీసావిత్రి యాదికొస్తుంది. సంరక్షణ అంటే

Published : 09 Dec 2021 03:43 IST

కొవిడ్‌ టీకా పొందిన వారిలో మహిళలే అధికం
న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం, నిజామాబాద్‌ వైద్యవిభాగం

టీకా తీసుకునేందుకు బారులు తీరిన మహిళలు

రాక్షస సంహారం అనగానే ఆదిపరాశక్తి గుర్తుకొస్తుంది. సహనం అంటే భూదేవితో పోలుస్తాం. భర్త ప్రాణం కోసం పోరాటమంటే సతీసావిత్రి యాదికొస్తుంది. సంరక్షణ అంటే పొలిమేరల్లో ఉండే గ్రామ దేవతలు ఎల్లమ్మ, పోలేరమ్మ కనిపిస్తారు. మన సంప్రదాయంలో సమాజానికి రక్షణగా స్త్రీ మూర్తి ఔన్నత్యాన్ని వర్ణించలేం. ఆ వారసత్వాన్ని ఆధునికతరం మహిళామూర్తులు కొనసాగిస్తున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని జయించడానికి వారే ముందు వరుసలో నిలుస్తున్నారు. అందుకు నిదర్శనమే ఇందూరులో పురుషుల కంటే అతివలే అత్యధికమంది టీకాలు తీసుకోవడం.

కు.ని లోనూ..
ఇటీవల కుటుంబ నియంత్రణ కోసం అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. అందులో మహిళలకు ఉద్దేశించిన డీపీఎల్‌ శిబిరంలో శస్త్రచికిత్సల లక్ష్యం 50-70 వరకు ఉంటే.. 100 మంది ముందుకొస్తున్నారు. పురుషులకు నిర్వహిస్తున్న శిబిరంలో నలుగురు ముందుకు రావడమే గగనంగా మారుతోంది. రోజుల కొద్దీ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తే ఒక శిబిరానికి వచ్చే వారి సంఖ్య రెండంకెలు దాటట్లేదు.

వెనుకబాటుకు గల కారణాలు..
నిజామాబాద్‌లో 1,17,024, కామారెడ్డిలో 59,888 మంది మహిళలు పురుషుల కంటే ఎక్కువగా టీకా తీసుకున్నారు. వాస్తవానికి పురుషులే ఎక్కువగా బయట తిరుగుతారు. వారి ద్వారానే ఇంట్లో వారికి వైరస్‌ సోకినట్లు అనుభవాలు చెబుతున్నాయి. కానీ టీకా తీసుకుని రక్షణ పొందడంలో మాత్రం వెనుకబడటానికి అపోహలే కారణమని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని