logo

రోడ్డు ప్రమాదంలో ప్రధానోపాధ్యాయుడి మృతి

ఆర్టీసీ బస్సు డ్రైవరు అతివేగంతో ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన ఘటన కామారెడ్డి- రాజన్నసిరిసిల్ల సరిహద్దులోని పెద్దమ్మ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Published : 15 Jan 2022 03:16 IST

రాము (పాతచిత్రం)

మాచారెడ్డి, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్సు డ్రైవరు అతివేగంతో ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ఒకరు మృతిచెందిన ఘటన కామారెడ్డి- రాజన్నసిరిసిల్ల సరిహద్దులోని పెద్దమ్మ అటవీప్రాంతంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకులగుట్టతండా గ్రామానికి చెందిన భూక్య రాము(42) గంభీరావుపేట మండలం రాజుపేటలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేసేవారు. శుక్రవారం రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజాసింగవరం గ్రామంలోని అత్తమామల ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. భార్య కళావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని