logo

ముగ్గుతో ముందుకు

సంక్రాంతి అంటే ఇంటికి చేరే ధాన్యపు రాశులు... పిండి వంటలు... గాలి పటాలు... రంగవల్లులు. వీటన్నింటిలో గుమ్మం ఎదురుగా వేసే ముగ్గులు పండగ శోభను ఆవిష్కరిస్తాయి. వాకిలి నిండా అద్దిన రంగులు... అతిథిని, సౌభాగ్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంటాయని నమ్ముతారు. ఇలాంటి సంబురాల వేళ విరుచుకుపడుతున్న ఒమిక్రాన్‌ కొంత గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పండగ చరితను, ముగ్గుల పరమార్థాన్ని నేటి కాలమాన పరిస్థితులకు అన్వయించుకుని...

Published : 15 Jan 2022 03:16 IST

సంక్రాంతి వేళ ఒమిక్రాన్‌ విజృంభించనీయొద్దు
రంగవల్లిలోని పరమార్థాన్ని గ్రహించాల్సిన తరుణమిది
న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌

సంక్రాంతి అంటే ఇంటికి చేరే ధాన్యపు రాశులు... పిండి వంటలు... గాలి పటాలు... రంగవల్లులు. వీటన్నింటిలో గుమ్మం ఎదురుగా వేసే ముగ్గులు పండగ శోభను ఆవిష్కరిస్తాయి. వాకిలి నిండా అద్దిన రంగులు... అతిథిని, సౌభాగ్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంటాయని నమ్ముతారు. ఇలాంటి సంబురాల వేళ విరుచుకుపడుతున్న ఒమిక్రాన్‌ కొంత గందరగోళ పరిస్థితులను సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో పండగ చరితను, ముగ్గుల పరమార్థాన్ని నేటి కాలమాన పరిస్థితులకు అన్వయించుకుని కరోనా వైరస్‌ను నిలువరించేలా ముగ్గులోకి దింపాల్సిన అవసరముంది. అంటే ముగ్గులు చాటే ఆరు అంశాల ప్రాధాన్యాన్ని గ్రహించి ముందుకు సాగాలి.


1.శుభ్రత

ముగ్గులు వేయాలంటే ఇళ్లు, వాకిలి శుభ్రం చేయాలి. తరువాత పేడ కలిపిన కల్లాపి చల్లుతారు. ఇది శుభ్రంగా ఉండాలని నేర్పుతుంది. ప్రస్తుతం మనకు కావాల్సిన ప్రధాన ఆయుధం శుభ్రతనే. ఇంటితోపాటు జీవన విధానంలోనూ ఈ నియమాలు పాటించాలి. నిత్యం చేతులను శుభ్రం చేసుకోవాలి.. లేదా శానిటైజర్‌ రాసుకోవాలి. ముక్కు, నోటి ద్వారా తుంపర్లు గాలిలోకి వ్యాపించకుండా, గాలిలోని తుంపర్లను పీల్చుకోకుండా మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించడం వంటివి చేస్తేనే శుభ్రత అనే ముగ్గులోకి కరోనా వైరస్‌ చిక్కుతుంది.


2. ఆరోగ్యం

ప్పుడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో అప్పుడు ఆ కుటుంబమంతా ఆరోగ్యకర వాతావరణంలో జీవిస్తుందన్నమాట. ఇక్కడ శుభ్రం చేయడానికి, ముగ్గు వేయడానికి శారీరక శ్రమ అవసరమవుతుంది. శారీరక శ్రమతో ఒంటికి మంచి వ్యాయామం అవుతుంది. ముగ్గు వేయడానికి చేసే పనులన్నీ శారీరక వ్యాయామ ప్రాధాన్యం చాటుతాయి. కరోనాను ఎదుర్కొనేందుకు శరీరం దృఢంగా ఉండాలంటే సరైన మోతాదులో వ్యాయామం చేయాలన్నది సారాంశం. సకాలంలో నిద్ర లేవడం, కనీసం అరగంటైనా ఒంటికి పని చెప్పాలి.


3.సృజనాత్మకత

ముంగిట్లో ముగ్గులు ఆ గృహానికి కళ తీసుకొస్తాయి. భువిపై ఇంద్రధనసు ఆవిష్కరించడానికి సృజనాత్మకతకు పదును పెడుతుంటారు. కాలనీలు, వివిధ సంస్థలు నిర్వహించే పోటీల్లోనూ ప్రతిభను చాటుతుంటారు. ఇలాంటి సాధన జీవనోపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి అవసరమని నొక్కి చెబుతోంది. కరోనాతో వివిధ రంగాల వారు అతలాకుతలమైనా.. సృజనాత్మక నైపుణ్యాలున్న వారు వణకలేదు. అందుకే చేస్తున్న పనిలో, చదువుల్లో వినూత్నంగా సాగాల్సిన అవసరముంది. 


4.చుక్కలను కలపడం

న్ని రెడీమేడ్‌ ముగ్గుల సాధనాలు వచ్చినా చుక్కల ముగ్గు వేస్తేనే సంతృప్తి. మనసులో అనుకున్న ఆకృతి, లేదా రథం ముగ్గు వేయడానికి చుక్కలన్నింటిని  సమన్వయపరచాలి. చుక్క తప్పినా నమూనా రూపం దెబ్బ తింటుంది. జీవితంలోనూ ఇంతే. చుక్కల్లాంటి కుటుంబం కావాలంటే.. ఉద్యోగం, చదువు, బంధుత్వం, సమాజం ఇలా అన్నీ సమన్వయం చేసుకుంటూ సాగాలి.


5. ప్రకృతి

న పండగలన్నీ ప్రకృతితో ముడిపడి ఉంటాయనడంలో సందేహం లేదు. సంక్రాంతికి వాకిట్లో వేసే ముగ్గు గతంలో బియ్యం పిండితో వేసేవారు. అలా ముగ్గు చీమలకు, పక్షులకు ఆహారంగా మారేది.  ప్రకృతిలోని జీవరాశులు ఏదో ఒక రూపంలో మానవ మనుగడకు దోహదం చేసేవే. అందుకే మనతోపాటు జంతుజాలాన్ని సంరక్షించి జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలి. కరోనా వేళ ప్రకృతి ప్రాధాన్యం తెలిసొచ్చింది. ఆక్సిజన్‌ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. స్వచ్ఛమైన గాలిని
పీలుస్తూ ఊపిరితిత్తులను పదిలపరుచుకుంటే అన్ని అవయవాలు సమర్థంగా పనిచేస్తాయన్న స్పృహ పెంచుకోవాలి.


6.శాస్త్రీయత

ముగ్గుల నమూనాలో శాస్త్రీయ కోణం ఉందని చెబుతారు. మనసులో అనుకున్న ముగ్గు వేసేటప్పుడు ఏకాగ్రతగా వాటిపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. అది మనసును ముగ్గుపైనే లగ్నం చేసేలా చేయడంవల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. కరోనా సోకి మరణించడానికి భయాందోళనకే కారణమన్నది నిపుణుల మాట. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే ఏ ప్రతికూలతనైనా ఎదుర్కోవచ్చు. ప్రశాంతంగా ఆలోచించడం అలవరచుకోవాలన్నది ఈ ముగ్గు శాస్త్రం చెబుతుంది.

జిల్లాలో  ఇలా..

(కరోనా మొదలైనప్పటి నుంచి ఈ నెల 13 వరకు కేసులు)నిర్వహించిన  
పరీక్షలు : 5,67,398
నమోదైన పాజిటివ్‌ కేసులు : 58,257

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని