logo

ఘనంగా సంక్రాంతి వేడుకలు

మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు.

Updated : 15 Jan 2022 19:20 IST

బీర్కూర్‌: మండలంలోని వివిధ గ్రామాల్లో శనివారం సంక్రాంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఇళ్ల ముందు అందమైన రంగవల్లికలను తీర్చిదిద్దారు. బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం, భైరాపూర్‌లోని రుక్మిణీ విఠలేశ్వరాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. చిన్నాపెద్దలు పతంగులు ఎగురవేసి సంబరాలు చేసుకున్నారు.


వైభవంగా శ్రీనివాసుని కల్యాణం

బీర్కూర్: మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో శనివారం శ్రీనివాసుని కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. బీర్కూర్‌ గ్రామానికి చెందిన కె.వీరయ్యగుప్తా, విమల దంపతుల సమక్షంలో అర్చకులు శేషుపంతులు శ్రీనివాసుడు, పద్మావతి అమ్మవారికి కల్యాణం జరిపించారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఆనంద్‌ పటేల్‌, కార్యదర్శి వెంకటేశం, సభ్యులు రాజశేఖర్‌, గంగాధర్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని