logo

సజావుగా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికలు

రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో సోమవారం మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. ఈ

Published : 18 Jan 2022 03:31 IST

గాంధారిలో స్థానిక ప్రజాప్రతినిధులకు సూచనలు చేస్తున్న కలెక్టర్‌ జితేష్‌

కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రెడ్‌క్రాస్‌ సొసైటీ ఎన్నికలు సజావుగా నిర్వహించాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో సోమవారం మండలస్థాయి అధికారులతో నిర్వహించిన వీసీలో ఆయన మాట్లాడారు. ఈ నెల 27న మండల స్థాయిలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. సొసైటీ సభ్యులకు చరవాణి ద్వారా సమాచారం అందించాలన్నారు. సభ్యత్వం పొందిన ఏడాది తర్వాత పోటీ చేయడానికి అర్హులన్నారు. మండలస్థాయిలో పది మంది సభ్యుల ఎన్నిక తర్వాత ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్లను ఎన్నుకోవాలన్నారు. ఇద్దరు సభ్యులను డివిజన్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీకి పంపాల్సి ఉంటుందన్నారు. 28న డివిజన్‌, 29న జిల్లాస్థాయి ఎన్నికలను శాంతియుత వాతావరణంలో పూర్తి చేయాలని సూచించారు. నిజామాబాద్‌, కామారెడ్డి రెడ్‌క్రాస్‌ సొసైటీ ఛైర్మన్లు ఆంజనేయులు, రాజన్న, ఆర్డీవోలు శ్రీను, రాజాగౌడ్‌, ఎంపీడీవోలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.  

పల్లెప్రగతి పనులు పూర్తి చేయకుంటే చర్యలు
గాంధారి : పల్లెప్రగతి పనులు పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని పాలనాధికారి జితేష్‌ వి పాటిల్‌ స్పష్టం చేశారు. గాంధారి మండలం తిమ్మాపూర్‌లో సోమవారం పర్యటించారు. వైకుంఠధామం వారం రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని సర్పంచి శోభ, ఎంపీటీసీ సభ్యుడు బాల్‌రాజ్‌కు సూచించారు. ఉపాధి కూలీలతో మాట్లాడారు. బీఎఫ్‌టీ మదన్‌తో మాట్లాడి కొలతలు, అంచనా ఇతర వివరాలు తెలుసుకున్నారు. సీహెచ్‌సీని సందర్శించారు. కొవిడ్‌ పరీక్షలు పెంచాలని సిబ్బందికి సూచించారు. ఎంపీపీ రాధ, సర్పంచి సంజీవ్‌, వైద్యులు హరీశ్‌, దివ్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో శోభారాణి, తహసీల్దార్‌ గోవర్ధన్‌, ఎంపీడీవో సతీశ్‌కుమార్‌, ఆర్‌ఐ నర్సింహారెడ్డి, ఎంపీవో రాజ్‌కిరణ్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని