logo

పాత నేరస్థుల కదలికలపై దృష్టి

స్నేహపూర్వక పోలీసింగ్‌తో సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, నేరాల నియంత్రణకు ముందుచూపుతో వ్యవహరించాలని సీపీ నాగరాజు సూచించారు. పెట్రోలింగ్‌ చేసేప్పుడు, ఇతర సమయాల్లో కాలనీల్లో పర్యటిస్తున్నప్పుడు

Published : 18 Jan 2022 03:31 IST

బోధన్‌ ఠాణాలో సిబ్బందితో మాట్లాడుతున్న సీపీ నాగరాజు

బోధన్‌, న్యూస్‌టుడే: స్నేహపూర్వక పోలీసింగ్‌తో సమాచార వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని, నేరాల నియంత్రణకు ముందుచూపుతో వ్యవహరించాలని సీపీ నాగరాజు సూచించారు. పెట్రోలింగ్‌ చేసేప్పుడు, ఇతర సమయాల్లో కాలనీల్లో పర్యటిస్తున్నప్పుడు పాత నేరస్థుల కదలికలు గమనించాలని ఆదేశించారు. బోధన్‌ ఠాణాను సోమవారం రాత్రి సందర్శించారు. జప్తు చేసిన వాహనాలను పరిశీలించారు. బ్యారెక్‌ చూసి రికార్డులు తనిఖీ చేశారు. ఏసీపీ రామారావు ఇన్‌స్పెక్టర్లు రవీందర్‌నాయక్‌, ప్రేమ్‌కుమార్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని